అనంతేశ్వరి మాతకు ఆషాఢ పూజలు

ABN , First Publish Date - 2023-07-10T00:11:39+05:30 IST

నగర శివారు శారదానగర్‌లో శివబాలయోగి ఆశ్రమంలో అనంతేశ్వరి ఆలయంలో ఆదివారం సాయంత్రం ఆషాఢ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అనంతేశ్వరి మాతకు ఆషాఢ పూజలు
అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకువస్తున్న భక్తులు

అనంతపురం కల్చరల్‌, జూలై 9 : నగర శివారు శారదానగర్‌లో శివబాలయోగి ఆశ్రమంలో అనంతేశ్వరి ఆలయంలో ఆదివారం సాయంత్రం ఆషాఢ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాఠ్‌కు విశేష అభిషేకాలు చేశారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. అనంతరం భక్తులు మేళతాళాల మధ్య సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తాళంకి వెంకటేష్‌ గుప్త, కార్యదర్శి దేవరాజ్‌, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-10T00:11:39+05:30 IST