70 ఏళ్ల వయసులో.. కళాశాల జ్ఞాపకాలు నెమరేసుకుంటూ...
ABN , First Publish Date - 2023-04-10T00:04:43+05:30 IST
హిందూపురం ఎస్‌డీజీఎస్ డిగ్రీ కళాశాల లో 1972-75 బ్యాచలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం గోరంట్లలో జరిగింది. 2021 జూలైలో తొలి స మ్మేళనం హిందూపురంలో నిర్వహించారు.
1972-75 బ్యాచ డిగ్రీ విద్యార్థుల సమ్మేళనం
గోరంట్ల, ఏప్రిల్ 9: హిందూపురం ఎస్‌డీజీఎస్ డిగ్రీ కళాశాల లో 1972-75 బ్యాచలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం గోరంట్లలో జరిగింది. 2021 జూలైలో తొలి స మ్మేళనం హిందూపురంలో నిర్వహించారు. రెండో దఫా 2022 మా ర్చి 27న గోరంట్లలో సమావేశమయ్యారు. డిగ్రీ కళాశాలలో ప్రవేశిం చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, గోరంట్ల ఏఎనకె డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ కెంపుల లక్ష్మీనారాయణ సహకారంతో మూడో సమ్మే ళనాన్ని మళ్లీ ఆదివారం ఇక్కడే చేపట్టారు. మొత్తం 22 మంది మి త్రులు ఒక్కచోట చేరారు. 70 ఏళ్ల వయసులో పాత జ్ఞాపకాలు గు ర్తుచేసుకున్నారు. బొంగరాలు, చిల్లాకట్టి, గోలీల ఆటలాడి.. సంతోషంలో మునిగితేలారు. ఇకపై ఏటా రెండుసార్లు సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. డబ్బు పోగుచేసి సామాజిక సేవలో భా గంగా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేస్తామని పేర్కొన్నారు. మిత్రుల కోరిక మేరకు నాలుగో సమావేశం తాడిపత్రి లేదా తుమ కూరులో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థుల్లో రిటైర్డ్ జిల్లా జడ్జి సూర్యనారాయణగౌడ్, ఛార్టెట్ అకౌంటెంట్ చంద్రశేఖర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ సూర్యప్రకాశరావు, ఏపీ సెక్రెటరేట్ సుధాకర్, యునైటెడ్ ఇన్సూరెన్స రీజనల్ మేనేజర్ చక్కీరప్ప, ప్రిన్సిపాల్ కెంపుల లక్ష్మీనారాయణ, మండీమర్చెంట్ భరతరాజ్, చైతన్య ట్రస్ట్ చైర్మన గంగిరెడ్డి ఉన్నారు.