చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి అమానుషం : టీడీపీ
ABN , First Publish Date - 2023-04-23T00:02:06+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ మూకల రాళ్ల దాడి అమానుషమని టీడీపీ నాయకులు ఖం డించారు.
మడకశిరటౌన, ఏప్రిల్ 22: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ మూకల రాళ్ల దాడి అమానుషమని టీడీపీ నాయకులు ఖం డించారు. శనివారం మడకశిర టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచా ర్జి మద్దనకుంట ఈరన్న విలేకరులతో మాట్లాడారు. జడ్‌ప్ల్‌స భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడితో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏస్థాయి లో దిగజారాయో అర్థమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం తేటతెల్ల మైందన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనలకు సైతం భద్రత కల్పించలేని దౌర్భా గ్యస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇది వైసీపీ మూకల పిరికిపంద చర్యఅన్నారు. చంద్రబాబు, లోకేశ సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. దీంతో అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారన్నారు. మంత్రి సురే్‌షను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స మావేశంలో మాజీ ఎంపీపీ ఆదినారాయణ, ఆశ్వర్థరామప్ప, మాజీ మున్సిపల్ చైర్మన ప్రకాష్, మాజీ మండలకన్వీనర్ రామాంజినేయులు పాల్గొన్నారు.
రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. శనివారం మడకశిరలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి వ స్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రం లో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణించిపోతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధిని గాలికొదిలి, కేవలం ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం, వేధించడం లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేశ పర్యటనలను అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. మంత్రి సమక్షంలోనే ప్రతిపక్ష నాయకునిపై దాడి చేయించడం ప్రజాస్వామ్యమా అ ని ప్రశ్నించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోలేరని, ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజాస్వామ్యమే గెలుస్తుందని చె ప్పారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు భక్తర్, పట్టణాధ్యక్షుడు మనోహర్, మండలకన్వీనర్ లక్ష్మీనారాయణ, బేగర్లపల్లి రవి, సుబ్బరాయుడు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
ఎర్రగుంటపాళ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీ పీ నాయకుల దాడికి నిరసనగా శనివారం మడకశిర అంబేడ్కర్ సర్కిల్‌లో టీడీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మంత్రి ఆదిమూలపు సురే్‌షను బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలతో మంత్రి దగ్గరుండి ఉసిగొల్పి దాడులు చేయించారని, ఇది దుర్మార్గ మ న్నారు. దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. ఎన్ని దాడులు చేసినా ఎదుర్కొంటూ ముందుకు సాగుతామని తెగేసిచెప్పారు. కార్యక్రమం లో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ జయకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన సుబ్బరాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శి గోపాలప్ప, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నగేష్ పాల్గొన్నారు.
రాళ్లదాడి పిరికిపంద చర్య
పెనుకొండ: చంద్రబాబునాయుడుపై వైసీపీ నేతల రాళ్ళదాడి పిరికిపం దల చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఖండించారు. శనివారం పట్టణంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి అల్లర్లకు పా ల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని మరిచి, చంద్రబాబు, లోకేశ పర్యటనలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీకి ప్రజాదరణ చూస్తుంటే తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ నాయకులకు వణుకు పుట్టిందన్నారు.
వివేకా హత్యకేసును పక్కదోవ పట్టిం చేందుకే వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నదన్నారు. మంత్రి సురేష్ బా ధ్యత మరిచి వీధిరౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడి చేస్తున్నపుడు మంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. సమావేశంలో నాయకులు మాధవ నాయుడు, శ్రీరాములు యాదవ్, గుట్టూరు సూరి, త్రివేంద్రనాయుడు, బాబుల్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సుబ్మ్రహ్మణ్యం, ఫయాజ్, సనావుల్లా, ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రొళ్ల: జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై దాడిని రొళ్ల టీడీ పీ నాయకులు ఖండించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీ పీ రాష్ట్ర వక్కలిగ సాధికార సమితి అధ్యక్షుడ వీఎం పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్ విలేకరులతో మాట్లాడారు. ఎర్రకొండపాళ్యంలో చం ద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రౌడీమూకల దాడి పిరికిపందల చర్య అని ఖండించారు. ఆంధ్రప్రదేశలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సమావేశంలో నాయకులు సన్నమారేగౌడ్, డైరెక్టర్ నారాయణప్ప, మాజీ సింగిల్‌విండో డైరెక్టర్ రామన్న, బండిరమేష్, చంద్ర ప్ప, మురళీ, రంగనాథ్ పాల్గొన్నారు.