బసవ మార్గం.. ప్రకాశవంతం!

ABN , First Publish Date - 2023-04-23T23:52:16+05:30 IST

కర్ణాటకలో పన్నెండో శతాబ్దంలో అవ తరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, ఆయన తత్త్వ బోధన సమాజా న్ని ప్రకాశవంతం చేస్తుందని పెనుకొండ కణ్వాశ్రమ దత్తానందగిరి స్వామీజీ అన్నారు.

బసవ మార్గం.. ప్రకాశవంతం!

దత్తానందగిరి స్వామీజీ

ఘనంగా బసవ జయంతి

హిందూపురంఅర్బన, ఏప్రిల్‌ 23: కర్ణాటకలో పన్నెండో శతాబ్దంలో అవ తరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, ఆయన తత్త్వ బోధన సమాజా న్ని ప్రకాశవంతం చేస్తుందని పెనుకొండ కణ్వాశ్రమ దత్తానందగిరి స్వామీజీ అన్నారు. ఆదివారం వీరశైవ లింగాయతల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బస వ జయంతిని ఘనంగా నిర్వహించారు. హిందూపురం మెయిన బజార్‌లోని బసవేశ్వరస్వామి ఆలయంలో బసవ చిత్రపటానికి పూజలు చేశారు. అక్కమహాదేవి మహిళా మండలి ఆధ్వర్యంలో గంగపూజ, వచన పఠనం, యువజన సంఘం ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ప్రదర్శించిన సాం స్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం వెండి రథం పై బసవేశ్వర విగ్రహాన్ని అధిష్ఠింపజేసి నగరోత్సవంలో ఊరేగించారు. అంత కు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో దత్తానందగిరి స్వామీజీ మాట్లా డారు. బసవ వచన సాహిత్యంతో ఆధ్యాత్మిక, జీవిత సత్యాన్ని బోధించారని, సమసమాజ స్థాపనకు పాటుపడ్డారన్నారు. పట్టణంలో బసవేశ్వరుని విగ్రహ ఏర్పాటుకు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన కొండూరు మల్లికార్జున రూ.లక్ష వి రాళం ప్రకటించారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత సంఘం అధ్యక్షుడు వీరభద్రప్ప, కార్యదర్శి ఉమేష్‌, ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప, కోశాధికారి సంపత, అక్కమహాదేవి మహిళా మండలి అధ్యక్షురాలు ముద్దమ్మ, కార్యదర్శి రే ణుక, సభ్యులు లయన మల్లికార్జున, ప్రభుకుమార్‌, లావణ్య, శివప్రకాష్‌, ర మేష్‌, వీర శైవలింగాయత కులస్థులు పాల్గొన్నారు.

మడకశిరటౌన: పట్టణంలోని గాంధీబజార్‌ బసవన్న ఆలయంలో బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణలు, అ ర్చనలు, అభిషేకాలు చేశారు. మహిళలు హారతులు మోశారు. వీరశైవ లిం గాయతలు అధిక సంఖ్యలో వేడుకలకు తరలివచ్చారు. భక్తులకు పానకం, పె సరబేడలు పంచిపెట్టారు. అదేవిధంగా డీహెచపీఎ్‌స కార్యాలయంలో బసవ న్న చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. డీహెచపీఎ్‌స అధ్యక్షుడు ఎంఆర్‌ హనుమంతు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అగళి: మండలకేంద్రంలో వీరశైవ లింగాయతలు బసవ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు.

Updated Date - 2023-04-23T23:52:16+05:30 IST