సుందరీకరణ నవ్వులపాలు..!
ABN , First Publish Date - 2023-04-29T00:05:25+05:30 IST
నియోజకవర్గ కేంద్రమైన మడకశిర పట్టణ సుం దరీకరణ నవ్వులపాలైంది. కోట్ల రూపాయల నిధులున్నా పనులు పడకేశా యి. రోడ్ల వెడల్పు, సెంటర్ డివైడర్లు, హైమాక్స్ లైట్లు, డైనేజీ వ్యవస్థను మె రుగుపరచడం లాంటి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.
నిధులున్నా ముందుకుసాగని పనులు
అర్ధంతరంగా రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు
నడిరోడ్డుపైనే విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు
ముంచుకొస్తున్న ప్రమాదాలు
సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల ఆధునికీకరణ ఊసేలేదు..
నాలుగేళ్లుగా మడకశిర వాసుల అవస్థలు
మడకశిర, ఏప్రిల్ 28: నియోజకవర్గ కేంద్రమైన మడకశిర పట్టణ సుం దరీకరణ నవ్వులపాలైంది. కోట్ల రూపాయల నిధులున్నా పనులు పడకేశా యి. రోడ్ల వెడల్పు, సెంటర్ డివైడర్లు, హైమాక్స్ లైట్లు, డైనేజీ వ్యవస్థను మె రుగుపరచడం లాంటి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. నాలుగేళ్లుగా ప ట్టణ వాసులకు ఈ పనులు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయే తప్ప... రూపు రేఖలు మారలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చేందుకు రూ.42 కోట్ల నిధులు మం జూరయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ.32 కోట్ల విలువైన పనులు చేపట్టారు. మరో రూ.పది కోట్లదాకా పనులు చేపట్టాల్సి ఉంది. ప్రారంభంలో పనులు వేగవంతంగా సాగాయి. నాలుగేళ్లుగా పనులు స్తంభించడంతో ప్రజలకు ఇ బ్బందులు తప్పడం లేదు.
పెనుకొండ రోడ్డు, పావగడ రోడ్డు డివైడర్లు, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. అమరాపురం రోడ్డు డివైడర్లు వేశారు. బీటీ రో డ్డు వేయాల్సి ఉంది. హిందూపురం రోడ్డు, మధుగిరి రోడ్డులో సెంటర్ డివైడ ర్స్ ఏర్పాట్లు చేశారు. అయితే హిందూపురం రోడ్డు, మధుగిరి రోడ్డు, మరికొ న్నిచోట్ల సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారుల ప్రమాదాలకు ఆస్కారంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదివ రకే మధుగిరి రోడ్డు వెటర్నరీ కాలేజీ సెంటర్ డివైడర్ వద్ద ద్విచక్రవాహనదారులు, వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. అమరాపురం రోడ్డులో మేగార్లపల్లి సమీపంలో కొన్నిరోజుల క్రితం ఇండియన గ్యాస్ లారీ డివైడర్ ను ఢీకొంది. పట్టణంలో కొన్నిచోట్ల విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు మధు గిరి రోడ్డు నాలుగు రోడ్ల కూడలిలో మధ్యలోనే ఉండిపోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని వాహనదారులు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి పట్టణంలో నిలిచిపోయిన పనులు చేపట్టి, సుం దరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
రోడ్డు మధ్యలో విద్యుత స్తంభాన్ని తొలగించాలి
నాగరాజు, మడకశిర
పట్టణంలోని పలుచోట్ల రోడ్ల వెడల్పులో భాగంగా విద్యుత స్తంభాలు అ లాగే వదిలేశారు. మధుగిరి రోడ్డు నాలుగురోడ్ల కూడలి రద్దీ ప్రాంతంలో న డిరోడ్డుపైనే ట్రాన్సఫార్మర్ ఉంది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ఈప్రాంతం గుండా వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి నడి రోడ్డుపైన ప్రయాణానికి ఆటంకంగా మారిని స్తంభాలు, ట్రా న్సఫార్మర్ తరలించాలి.
డివైడర్లను ఢీకొని తరచూ ప్రమాదాలు
రంగనాథ్, మడకశిర
డివైడర్‌లు ఏర్పాటు చేసి, వీధి దీపాలు ఏర్పాటుచేయక పోవడంతో తర చూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెటర్నరీ కాలేజీ, బేగార్లపల్లి క్రాస్ వద్ద ద్విచక్రవాహనాలు, భారీవాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది క్షతగాత్రులయ్యారు. అధికారులు స్పం దించి మధుగిరి రోడ్డు, హిందూపురం రోడ్డు, బేగార్లపల్లి క్రాస్ వద్ద వీధి దీ పాలు ఏర్పాటు చేసి, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.
రూ.32 కోట్ల విలువైన పనులు చేపట్టాం
లక్ష్మీనారాయణ, ఆర్‌అండ్‌బీ ఏఈ
పట్టణంలో రోడ్ల వెడల్పు, సెంటర్ లైంటిగ్, డివైడర్లు తదితర పనులు చేపట్టడానికి రూ.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.32 కో ట్ల దాకా పనులు చేపట్టారు. మరో రూ.పది కోట్ల దాకా పనులు చేపట్టాల్సి ఉంది. త్వరలోనే పనులు చేపట్టి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతాం.