ఆరోగ్య ఉపకేంద్రానికి దారి చూపాలి : బీజేపీ
ABN , First Publish Date - 2023-06-10T00:04:19+05:30 IST
పట్టణంలోని రాంనగర్ ఆరోగ్య ఉపకేంద్రానికి దారి చూపాలని బీజేపీ నాయకులు డిమాండ్‌చేశారు.
ధర్మవరం, జూన 9: పట్టణంలోని రాంనగర్ ఆరోగ్య ఉపకేంద్రానికి దారి చూపాలని బీజేపీ నాయకులు డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆరోగ్య ఉపకేంద్రానికి వెళ్లే దారిలో ఉన్న మురుగునీటిలో నిలబడి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి ప్రతిచోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది పేద ప్రజలు వైద్యం కోసం వస్తుంటారన్నారు. రహదారి గుంతల్లో వర్షం నీరు నిల్వఉంటోందని, అందులోనే నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందన్నారు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనాస్పందించి వెంటనే రహదారిసౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాలరెడ్డి, జింకా చంద్రశేఖర్, సాకే ఓబుళేశు, గుండాపుల్లయ్య, శంకరచంద్రశేఖర్, కార్తీక్, గూడూరు నారాయణస్వామి, పుట్లూరు నరసింహులు, శేఖర్, రాధమ్మ పాల్గొన్నారు.