జగనాసుర రక్తచరిత్ర పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2023-03-02T23:48:18+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని టీడీపీ మండల నా యకులు పేర్కొన్నారు.
బుక్కపట్నం, మార్చి 2: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని టీడీపీ మండల నా యకులు పేర్కొన్నారు. వారు గురువారం బుక్కపట్నంలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై అనవసరమైన కేసులు పెడుతూ వారి గొంతునొక్కుతున్నారన్నారు. వైఎస్ వివేకానం దరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తూ అసలైన నిందితులను కాపాడు తున్నారన్నారు. కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుగలమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లిరెడ్డి, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తెలుగుమహిళా అధ్యక్షురాలు లావణ్యగౌడ్, నాయకులు కాయగూరలచంద్ర, సయ్యద్‌బాషా, వెంకట రాముడు, కరణం శ్రీరాములు, కేశవనాయుడు, సుదీర్, వాజీద్, జయరాం పాల్గొన్నారు.