ఎగువ భద్రతో సీమ ఎడారే
ABN , First Publish Date - 2023-02-08T23:46:21+05:30 IST
కర్ణాటకలో నిర్మించే ఎగువ భద్ర (అప్పర్ భద్ర) ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ ఆందోళన వ్యక్తం చేశాడు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్
అనంతపురం విద్య, ఫిబ్రవరి 8: కర్ణాటకలో నిర్మించే ఎగువ భద్ర (అప్పర్ భద్ర) ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ ఆందోళన వ్యక్తం చేశాడు. బుధవారం జడ్పీలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషక నిపుణుడు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం భద్ర నదిపై అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. ఈ అప్పర్‌భద్ర నిర్మాణం పూర్తయితే... సీమకు చుక్కనీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. సీమ జిల్లాలకే కాకుండా తెలంగాణాలోని రాజోలి బండ, ఏపీలోని శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా నీరు అందే పరిస్థితులు ఉండవన్నారు. ఈ నెల 13 నుంచి 24 వరకూ ఏపీ సాగునీటి ప్రాజెక్టులు, కాలువలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు పర్యటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుప్రీం కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో కేంద్రం అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, అనుమతులివ్వడం దారుణమన్నారు. దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన వేయాలన్నారు. వీటిపై ముఖ్యమంత్రి జగన నోరు మెదపకపోడం దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వానికి జగన ఊడిగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి డ్యాన్సులు చేస్తూ..కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. ఇది రాయలసీమ సమస్య కాదని, రాష్ట్ర సమస్య అన్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాజెక్టులకు ఏడాదికి వచ్చే 2060 టీఎంసీల నికర జలాలు, 12 సబ్ రివర్ బేసిన్స, మూడు ప్రధాన రివర్ బేసిన్సపై మ్యాప్ ద్వారా వివరించారు. దీనిపై ప్రభుత్వం రాజకీయంగానే కాకుండా న్యాయ పరంగా కూడా పోరాటం చేయాలన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం నిలిచే వరకూ పోరాటాలు చేయాలని ఆయన కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సీపీఐ జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్య ఇతర నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ మున్సిపల్ కార్పొరేషన కోఆప్షన సభ్యులు శివబాల, ఇతర సీపీఐ నాయకులు రామకృష్ణ, కేశవరెడ్డి, శ్రీరాములు, లింగమయ్య, మల్లికార్జున, రమణ, సంతో్‌షకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.