ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2023-06-05T23:59:58+05:30 IST

స్థానిక కమ్మపాళ్యంలో మూడు రోజుల క్రితం జరిగిన భారీ చోరీ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇంట్లో చోరీ

రూ.7.50 లక్షల నగదు అపహరణ...

ఆలస్యంగా వెలుగులోకి..

కొత్తచెరువు, జూన 5: స్థానిక కమ్మపాళ్యంలో మూడు రోజుల క్రితం జరిగిన భారీ చోరీ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ లింగన్న తెలిపిన వివరాలివి. కమ్మపాళ్యంకు చెందిన పీవీ కిరణ్‌కుమార్‌ ఇటీవల తన భూమిని విక్రయించాడు. రూ.17.40 లక్షలు రాగా, ఆ డబ్బును బెడ్‌రూం అలమరాలో దాచాడు. మరుసటి రోజు అందులో నుంచి రూ.1.40 లక్ష ఇతరులకు బాకీ నిమిత్తం చెల్లించాడు. మిగిలిన రూ.16 లక్షలు ఇంట్లోనే ఉంచాడు. మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బెడ్‌రూం బ్యాగులో ఉన్న డబ్బు దొంగలించారు. కిరణ్‌కుమార్‌ బ్యాగును తెరచి చూడగా రూ.8.50 లక్షలు మాత్రమే నగదు ఉంది. మిగిలిన రూ.7.50 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-06-05T23:59:58+05:30 IST