చెట్టును ఢీకొన్న కారు - ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-04-10T00:06:13+05:30 IST
మండలంలోని కొల్లకుంట గ్రామం వద్ద ఆదివా రం కారు వేగంగా వస్తూ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో యువకుడు దాదా ఖలందర్(20) అక్కడికక్కడే మృతి చెందాడు.
హిందూపురం అర్బన, ఏప్రిల్ 9: మండలంలోని కొల్లకుంట గ్రామం వద్ద ఆదివా రం కారు వేగంగా వస్తూ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో యువకుడు దాదా ఖలందర్(20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కొ త్తచెరువు గ్రామానికి చెందిన దాదాఖలందర్, మహ్మద్ గౌస్ వరసకు బావ బావమరుదులు. పని నిమిత్తం కొత్తచెరువు నుంచి హిందూపురానికి కారులో వస్తున్నారు. హిం దూపురం-పెనుకొండ ప్రధాన రహదారిలో కారు వేగంగా వస్తూ చెట్టును ఢీకొంది. ఘటనలో కారు నడుపుతున్న దాదాఖలందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహ్మద్ గౌస్ గాయపడ్డాడు. మృతుడు కొత్తచెరువుకు చెందిన వలీసాబ్, బీబీజాన దంపతుల రెండవ కుమారుడు. ఇంటర్ వరకు చదివి పార్ట్‌టైమ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహ్మద్ గౌస్ జిల్లాకేంద్రంలోని డీఎంహెచఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గాయపడిన మహ్మద్ గౌస్‌ను స్థానికులు మిల్లు అంబులెన్సలో హిందూపు రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.