అదనపు విద్యుదుత్పత్తి చేసిన ఘనత చంద్రబాబుదే.. : బీకే
ABN , First Publish Date - 2023-05-21T00:02:24+05:30 IST
‘నారా చంద్రబాబు నాయుడు 2014లో ము ఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్రంలో 22.5 మిలియన యూనిట్ల విద్యుత లోటు ఉండేది. దాన్ని అధిగమించి 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత సామర్థ్యాన్ని పెంచారు. ఆ ఘనత టీడీపీదే...’ అని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు.
పెనుకొండ, మే 20: ‘నారా చంద్రబాబు నాయుడు 2014లో ము ఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్రంలో 22.5 మిలియన యూనిట్ల విద్యుత లోటు ఉండేది. దాన్ని అధిగమించి 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత సామర్థ్యాన్ని పెంచారు. ఆ ఘనత టీడీపీదే...’ అని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోతలపై సాక్షి ప త్రిక తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. త ప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశా రు. 22 మంది ముఖ్యమంత్రులు 7వేల మెగావాట్ల విద్యుత ఉత్పత్తిని చేస్తే, చంద్రబాబు ఒక్కరే 15 వేల మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చే శారన్నారు. జగన ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత చార్జీలు పెంచి ప్రజ ల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా అసత్య కథనాలు మాని ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత అందించాలని హితవుపలికారు. వివే కా హత్యకేసును సాక్షి పత్రిక పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నా రు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు. లేనిపక్షంలో సీబీఐపై కూడా ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. అనంతరం ‘దళిత ద్రోహి జగన్మోహనరెడ్డి - దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రన్న’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో బీసీసాధికా సమితి జిల్లా అ ధ్యక్షుడు కుంటి మద్ది రంగయ్య, యాదవ సంఘం అఽధ్యక్షుడు కేశవ య్య, సీనియర్ నాయకులు బక్సంపల్లి రామక్రిష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, బాబుల్‌రెడ్డి, పాలడుగు చంద్ర, సూర్యనారాయణరెడ్డి, హుజురుల్లాఖాన, అత్తర్ ఖాదిర్, బోయ అనిల్ పాల్గొన్నారు.
విద్యుత కొనుగోళ్లపై విచారణ జరపాలి : గుండుమల
మడకశిరటౌన: కమీషన్ల కోసం కృత్రిమ విద్యుత కొరత సృష్టిస్తున్నారని, విద్యుత కొనుగోలు అవినీతి, ఒప్పందాలపై విచారణ చేపట్టాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చే శారు. శనివారం పట్టణంలోని బాలాజీ నగర్ పార్టీ కార్యాలయంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. అవినాశరెడ్డి బినామీ కంపెనీలైన షి రిడీసాయి ఎలెక్ర్టికల్ వద్ద రూ.60 వేలు ధర ఉన్న ట్రాన్సఫార్మర్‌కు రూ.1.30 లక్షలు ఎందుకు డబ్బుపెట్టి కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. నాసిరకం పరికరాల వల్లే థర్మల్ ప్లాంట్‌లలో విద్యుత బ్రేక్‌డౌన, సాంకేతిక లోపాలు వస్తున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హ యాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత చార్జీలు పెంచలేదని తెలిపా రు. జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక వరుసగా ఏడుసార్లు పెంచారన్నారు. వినియోగదారులపై రూ.57.188 కోట్ల భారం మోపారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి ఏటా విద్యుత చార్జీలు పెంచుతూ వ చ్చారన్నారు. యూనిట్ రూ.16లకు కొనుగోలు చేసి, డిస్కంలను రూ. 6.600 కోట్ల నష్టాల్లోకి నెట్టిన ఘనత వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డికి దక్కితే ... ప్రస్తుతం కుమారుడు జగనమోహనరెడ్డి ఏడుసార్లు విద్యుత చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత దక్కిందన్నారు. షిరిడీసాయి ఎలెక్ర్టికల్స్‌కు రూ.2629 కోట్ల బిల్లులు చెల్లించారని ఆరోపించారు. విద్యుత చార్జీల బాదుడే బాదుడని, కరెంట్ కోతలతో వినియోగదారులపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. కరెంట్ కోతలు జగనరెడ్డి దోపిడీ, కమీషన్ల కోసం కక్కుర్తి వల్లే కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజలపై ఇంత భారం మోపుతున్నా, జగన తన సొంత సాక్షిపత్రికలో కోతల్లేని కరెంట్ అని వచ్చిన కథనాన్ని ఖండించారు. వార్తా పత్రికలను చించి నిరసన వ్యక్తం చేశారు. క్విడ్ ప్రోకోలకు ప్రభుత్వ విద్యుత సంస్థ వాటి సామర్థ్యం మేరకు ఎందుకు విద్యుత ఉత్పత్తి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స మావేశంలో నాయకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, భక్తర్, మనోహర్, ల క్ష్మీనారాయణ, సుబ్బరాయుడు, కన్నా, బేగార్లపల్లి రవి పాల్గొన్నారు.