అంబరాన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2023-04-20T23:20:34+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అ ధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సం బరాలు చేశారు.
హిందూపురం/పెనుకొండ/గోరంట్ల/రొద్దం/లేపాక్షి/మడకశిరటౌన/ అగళి/రొళ్ల/సోమందేపల్లి, ఏప్రిల్ 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అ ధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సం బరాలు చేశారు. ఆస్పత్రుల్లో పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. పలు ఆలయా ల్లో చంద్రబాబు పేరుమీద అర్చనలు చేయించారు. చంద్రబాబు నాయక త్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్‌లో భారీ కేక్ కట్ చేశా రు. పెనుకొండలో నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుల ను జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఘనంగా సత్కరించారు. ఏజాజుల్లాఖాన, టెంకాయల ఫారూక్, ఖలీల్‌సాబ్, నాగభూషణం, నీలకంఠారెడ్డి, తి ప్పారెడ్డి, చంద్రప్ప, రంగప్ప, కొల్లప్ప, అశ్వర్థప్ప, తిప్పన్నకు పూలమాలలువే సి, శాలువాకప్పి పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత స్వగృహం వద్ద భారీ కేక్ కట్‌చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం రంజాన పండుగ సందర్భంగా నిరుపేదలైన 1500 ముస్లిం కుటుంబాలకు పది రకాలతో కూడిన రంజాన తోఫా కిట్‌ల ను అందజేశారు. గోరంట్లలోని సినిమా హాల్ ఆవరణలో మాజీ ఎంపీ ని మ్మల కిష్టప్ప, కుమారుడు నిమ్మల శిరీష్, మాజీ సర్పంచు నిమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్ పంచిపెట్టారు. రొద్దం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు హిందూపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్టీ నాయకులు హాజరయ్యారు. లేపాక్షిలో టీడీపీ మండల కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వగృహంలో కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిరలో అన్న క్యాంటీన వద్ద కేక్ కట్‌చేసి, అన్నదానం చేశారు. షిరిడీ సాయినాథుని ఆలయంలో చంద్రబాబు పేరిట అర్చనలు, అభిషేకా లు నిర్వహించారు. మడకశిర టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న ఆధ్వర్యంలో షిరిడీసాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్‌కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. అగళి టీడీపీ జడ్పీటీసీ ఉమేష్ ఆధ్వర్యంలో ఎనటీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బ స్టాండు ఆవరణలో కేక్ కట్‌చేసి, స్వీట్లు పంచుకొన్నారు. రొళ్ల బస్టాండు ఆవరణలో టీడీపీ నాయకులు కేక్‌కట్‌చేసి స్వీట్లు పంచుకొన్నారు. సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. గుడిబండలో నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.