మార్కెట్ వేలాలపై టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన
ABN , First Publish Date - 2023-05-09T00:01:38+05:30 IST
స్థానిక నగర పంచాయతీ పరిధిలో నిర్వ హించనున్న వేలంపాటల్లో పారదర్శకత లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆం దోళనకు దిగారు.
మడకశిరటౌన, మే 8: స్థానిక నగర పంచాయతీ పరిధిలో నిర్వ హించనున్న వేలంపాటల్లో పారదర్శకత లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆం దోళనకు దిగారు. కమిషనర్ అధికార పార్టీ నాయకులకు అనుకూలం గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో కూరగాయల మార్కెట్, బస్టాండు, చేపల చెరువు, దినసరి మార్కెట్ వేలంపాటకు తక్కువ మొత్తం డిపాజిట్ రుసుం చెల్లించేలా పాటదారులకు అనుకూలంగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఏకంగా రూ. లక్ష డిపాజిట్ చెల్లించాలని కమిషనర్ ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. అధిక మొత్తం చెల్లించాల్సి రావడంతో వేలంలో పాల్గొనేందుకు ఒక్కరుకూడా ముందుకు రాలేదన్నారు. మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శించారు. పాత విధానంలో పారదర్శకంగా వేలం నిర్వహించాలని పట్టుపట్టారు. ఎస్‌ఐ సురే్‌షబాబు ఆందోళనకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో సీఐ సురే్‌షబాబు అక్కడికి చేరుకొని కమిషనర్, కౌన్సిలర్లతో చర్చించారు. కమిషనర్ స్పంది స్తూ, సమస్యను ఆర్‌డీ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.