గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2023-11-23T00:19:55+05:30 IST
సత్యసాయిబాబా జయంతి వేడుకలకు హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బుధవారం ఘన స్వాగతం లభించింది.
చిలమత్తూరు, నవంబరు 22: సత్యసాయిబాబా జయంతి వేడుకలకు హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బుధవారం ఘన స్వాగతం లభించింది. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి వెళ్లే దారిలో కొడికొండ చెక్‌పోస్టులోని రక్షా అకాడమిలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ నరేష్ కృష్ణ ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. విశ్రాంతి అనంతరం ఆయన భారీ పోలీస్ కాన్యాయ్‌తో పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. గవర్నర్ పుట్టపర్తికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.