Share News

వర్షం కోసం పప్పుశనగ రైతుల ఎదురుచూపులు

ABN , First Publish Date - 2023-11-23T00:24:24+05:30 IST

మండలంలో పప్పుశనగ సాగుచేసిన రైతులు వర్షం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామా ల్లో అరకొర వర్షంతోనే పప్పుశనగ పంట సాగుచేశారు.

వర్షం కోసం పప్పుశనగ రైతుల ఎదురుచూపులు
వర్షం రాకపోవడంతో ఆర్‌ కొట్టాలలో జానెడు ఎత్తులోనే ఉన్న పంట

రొద్దం, నవంబరు 22 : మండలంలో పప్పుశనగ సాగుచేసిన రైతులు వర్షం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామా ల్లో అరకొర వర్షంతోనే పప్పుశనగ పంట సాగుచేశారు. అరకొర తేమలోనే విత్తనం మొలకెత్తింది. ఆ తరువాత విత్తనం జాడలేదు. దీంతో పప్పుశనగ పంట జానెడు ఎత్తు మాత్రం పెరిగింది. ప్రస్తుతం పూత దశలో ఉంది. అయితే ఇప్పటికీ వర్షం కురవకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి లోని ఆర్‌ కొట్టాల, ఆర్‌ మరువపల్లి, పెద్దగువ్వలపల్లి, గోనిమేకలపల్లి, చిన్న మంతూరు, డీఆర్‌ కొట్టాల, చెరుకూరు పాతర్లపల్లి తదితర గ్రామాల్లో పప్పుశనగ పంటను వేలాది ఎకరాల్లో రైతులు సాగుచేశారు. వర్షం రాకపోవడంతో బొక్సంపల్లిలో 1500ఎకరాల సాగు భూమిని బీడుగా వదిలే శారు. ఈ యేడాది సక్రమంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండు తాయన్న ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిల్చింది. గత యేడా ది దాదాపు ఏడువేల ఎకరాల దాకా పప్పుశనగ సాగుచేశారు. దిగుబడి బాగా వచ్చింది. ఈ యేడాది కూడా వర్షాలు కురిసి పంటలు బాగా పండు తాయన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గత యేడాదికంటే సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గింది. చెరుకూరు, చిన్నమంతూరు, డీఆర్‌ కొట్టా ల, గోనిమేకలపల్లి తదితర ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం కురిసింది. మిగిలిన గ్రామాల్లో వర్షాలు రాకపోవడంతో పప్పుశనగ రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-11-23T00:24:26+05:30 IST