వారంలోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2023-06-07T00:09:45+05:30 IST

జగనన్న లేఔట్లలో వారంలోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌బాబు హెచ్చరించారు.

వారంలోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి

లేకపోతే పట్టాలు రద్దు : కలెక్టర్‌

బుక్కపట్నం, జూన 6: జగనన్న లేఔట్లలో వారంలోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌బాబు హెచ్చరించారు. స్థానిక కస్తూర్బా పాఠశాల వద్ద జగనన్న లేఔట్‌ను మం గళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. బుచ్చయ్యగారిపల్లి వద్ద లబ్ధిదారులకిచ్చిన పట్టా ల్లో వారంలోపు నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణాలు వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణాలపై లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించి, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 72 ఇళ్లు మంజూరుకాగా, అందులో 16 మాత్రమే పూర్తి అయిన విషయాన్ని కలెక్టర్‌ గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే రద్దుచేసి, మరొకరికి పట్టా ఇస్తామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో భాగ్యరేఖ, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళిరెడ్డి, ఇనచార్జి డీఈ షామీర్‌బాషా, తహసీల్దార్‌ నటరాజ్‌, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఈ గౌస్‌మోద్దీన ఉన్నారు.

అమడగూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషలాఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన గృహనిర్మాణ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. సకాలంలో బిల్లులు చెల్లించి, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇంటి జియోట్యాగింగ్‌ వేగవంతం చేసి, లబ్ధిదారులకు బిల్లులు మంజూరులో అసత్వం వహించకూడదన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గడ్డం మునెప్ప, ఏఓ భానుప్రకాష్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:09:45+05:30 IST