కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయడం లేదు
ABN , First Publish Date - 2023-05-31T23:41:53+05:30 IST
కాంట్రాక్టర్లు కుమ్మక్కై అభివృద్ధి పనులు చేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఆ రోపించారు.
మున్సిపల్ కౌన్సిల్‌లో అధికార పార్టీ సభ్యుల పెదవి విరుపు
అభివృద్ధిపై ప్రతిపక్షాల సవాల్
గందరగోళం నడుమ ముగిసిన సమావేశం
హిందూపురం, మే 31: కాంట్రాక్టర్లు కుమ్మక్కై అభివృద్ధి పనులు చేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఆ రోపించారు. బుధవారం చైర్‌పర్సన అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ స మావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలోని అంశాలను వివరిస్తుండగా, అధికార పార్టీ కౌన్సిలర్ ఆసీఫ్ అడ్డుతగులుతూ మాట్లాడా రు. కాంట్రాక్టర్లు బిల్లులు కాలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బిల్లులు మంజూరైనా... కాలేదంటూ చెప్పుకొని కౌన్సిల్‌కు చెడ్డపేరు తెస్తున్నారని పేర్కొన్నారు. ఐదు శాతం ఎక్కువగా టెండరు వేసే కాంట్రాక్టర్లు హిందూపురంలో ఉన్నారన్నారు. వారిని పిలిపించి పను లు చేయించకుండా, అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఎజెండాలో కోట్ల రూపాయలు చూపిస్తున్నారు కానీ క్షేత్ర స్థా యిలో జరగడం లేదన్నారు. ఇదే సమయంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటి పథకం వల్లనే హిందూపురంలో అభివృద్ధి ఆగిందని, వచ్చే ఆదాయమంతా నీటికి కట్టడానికే సరిపోతోందని అన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పని అన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ రమేష్ స్పందించారు. ప్రతి సమావేశంలో గొల్లపల్లి రిజర్వాయర్ నీటి గురించి మాట్లాడటం తప్పా ఈ రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చె ప్పాలన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే గొల్లపల్లి నీటిని ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆర్పీజీటీ రోడ్డు పేరు మార్పు పై రగడ జరిగింది. తనకు తెలీయకుండా ఎజెండా నుంచి ఈ అంశా న్ని రద్దు చేశారని అ వార్డు కౌన్సిలర్ ప్రశ్నించారు. అయితే ఇది సున్నితమైనా అంశమని, అందరితో చర్చించాక శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ చైర్‌పర్సన, వైస్ చైర్మన్లు సర్దిచెప్పారు. ఈ గందరగోళం మధ్యనే అజెండా అంశాలను ఆ మోదించినట్లు చైర్‌పర్సన పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ ప్ర మోద్‌కుమార్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.