భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం
ABN , First Publish Date - 2023-07-06T23:46:20+05:30 IST
మండలంలోని సింగానివారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం ముదిరింది.
- పిల్లలను పాఠశాలకు పంపని తల్లిదండ్రులు
గాండ్లపెంట, జూలై 6: మండలంలోని సింగానివారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం ముదిరింది. విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలలో 29 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో పనిచేసే భోజన ఏజెన్సీ నిర్వాహకులను ఎమ్మెల్యే లేఖతో ఎంఈఓ తొలగించి, ఇతరులకు అప్పగించారు. దీంతో గ్రామంలో వివాదం ముదిరింది. ఏజెన్సీని మార్చేంత వరకూ తమ పిల్లలను బడికి పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు ఖరాకండిగా చెబుతున్నారు. ఐదురోజులుగా దాదాపు 16 మంది విద్యార్థులకు పైగా బడికి వెళ్లకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. ఈవిషయంపై ప్రధానోపాధ్యాయులు వెంకటనారాయణరెడ్డిని వివరణ కోరగా, గతంలో ఏడాది పాటు ముందు పనిచేసిన ఏజెన్సీ నిర్వాహకురాలు కొనసాగాలని, ఆతర్వాత మరొకరికి అవకాశం కల్పించేవిధంగా తల్లిదండ్రుల సమావేశంలో గతంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆమేరకే ఏజెన్సీని మార్చడం జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని తెలిపారు.