ఇసుక రీచ వద్ద సీపీఐ ఆందోళన
ABN , First Publish Date - 2023-04-07T23:57:02+05:30 IST
మండలకేంద్రం సమీపంలోని జయమంగళి నది వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచను రద్దు చేయాల ని సీపీఐ నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
పరిగి, ఏప్రిల్ 7: మండలకేంద్రం సమీపంలోని జయమంగళి నది వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచను రద్దు చేయాల ని సీపీఐ నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయకుల ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి హిందూపురం రూరల్ స్టేషనకు తరలించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మైనిం గ్ అధికారులు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అనుమతులు ఇ చ్చారని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుందని వాల్టా చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇసుక తరలించడం సమంజసం కాదన్నారు. మండలంలో ప్రజలు, ప్రజాసంఘాలు, రా జకీయ పార్టీలను కలుపుకుని పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇసుకను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నదని మండిపడ్డారు. నిరసనలో నాయకులు వినోద్, శివప్ప, చంద్రశేఖర్‌రెడ్డి, చలపతి, ఇస్మాయిల్, మారుతిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.