జగన పాలనలో కార్మికులకు మరణ శాసనం : టీడీపీ

ABN , First Publish Date - 2023-05-01T23:43:49+05:30 IST

దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఎంతో ఘనం గా నిర్వహిస్తుంటే... రాష్ట్రంలో మాత్రం సీఎం జగన కార్మికులకు మరణ శా సనం రాసారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ కార్మిక ది నోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

జగన పాలనలో కార్మికులకు మరణ శాసనం : టీడీపీ

వాడవాడలా అరుణపతాక రెపరెపలు

ఘనంగా కార్మిక దినోత్సవం

కదంతొక్కిన కార్మిక లోకం

మడకశిరటౌన, మే 1: దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఎంతో ఘనం గా నిర్వహిస్తుంటే... రాష్ట్రంలో మాత్రం సీఎం జగన కార్మికులకు మరణ శా సనం రాసారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ కార్మిక ది నోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కార్మిక లోకం కదంతొక్కింది. వాడవాడలా అరుణ పతాకం రెపరెపలాడింది. మడకశిరలో టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యం లో పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. టీఎనటీయూసీ నాయ కులు, కార్మికుల సమక్షంలో ఆయన కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అనంత రం తిప్పేస్వామి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో భవ న నిర్మాణ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. ఉ పాధి హామీ నిధుల మళ్లింపుతో కూలీలకు పనులు లేక వలసలు తప్పలేద న్నారు. కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా, వారి సంక్షేమా న్ని ముఖ్యమంత్రి గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, టీఎనటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బాలేపల్లి రాజు, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు భక్తర్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షు డు మంజునాథ్‌, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారప్రతినిధి నాగరాజు, కౌన్సిలర్‌ ఉమేష్‌, తెలుగుయువత నాయకులు తిమ్మరాజు, నాయకులు బేగార్లపల్లి రవి పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

మడకశిరలో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డేను పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ ఓబులు ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడి హక్కులు సా ధించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్‌, అంగనవాడీ రాష్ట్ర నాయకులు శ్రీదేవి, ఆ శావర్కర్ల సంఘం నాయకులు సౌభాగ్య, కేవీపీఎస్‌ నాయకులు రామాంజనేయులు, ఆటోడ్రైవర్ల సంఘం నాయకులు ప్రసాద్‌, కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఐ సురే్‌షబాబు ఆటో డ్రైవర్లతో కలసి భగతసింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లతో స మావేశం నిర్వహించి మాట్లాడారు.

కార్మికుల పక్షాన టీడీపీ పోరాటం

హిందూపురం: కార్మికుల కోసం పథకాలు తీసుకొచ్చి, వారి డిమాండ్ల సాధన కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ నాయకులు అ న్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద టీఎనటీయూసీ ఆధ్వర్యంలో కే క్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ కార్మికుల ఐక్యతగా వర్థిల్లాలని, వారి డిమాండ్ల సాధన కోసం టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన అ నిల్‌, పట్టణాధ్యక్షుడు రమేష్‌, నాయకులు నెట్టప్ప, వెంకటేశ, సతీష్‌, నవీన, ఆంజనేయులు, బాబా, నందీశ, లీగల్‌సెల్‌ అధ్యక్షుడు శివశంకర్‌, అశ్వర్థనారాయణరెడ్డి, హెచఎన రాము, రామక్రిష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, నబీరసూ ల్‌, ప్రసాద్‌, శివ, చిన్నారెడ్డి, పరిమళ, విజయలక్ష్మీ, చెన్నమ్మ, గీత పాల్గొన్నారు.

ఎరుపెక్కిన పురం

హిందూపురం అర్బన: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పురంలో కార్మికలోకం కదం తొక్కింది. పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కిం ది. విప్లవ వీరుల నినాదాలు మిన్నంటాయి. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి చిన్నమార్కెట్‌, గాంధీ సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని, లేకపో తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈఎ్‌సఐ, పీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, భవన నిర్మాణ కారర్మికులకు సంక్షేమ నిధి, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు, ఆ టో యూనియన్లు, ఆర్టీసీ కార్మికులు, ప్రీకాట్‌ మిల్లు, భవన నిర్మాణ కార్మికు లు, ఆసుపత్రి, అంగనవాడీ కేంద్రాలు, ఆశవర్కర్‌లతో కలిసి సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీసీ, రాయలసీమ గ్రేటర్‌ పార్టీ, పాలిటెక్నిక్‌ కళాశాల వర్కర్లు, మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూ నియన ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

గోరంట్ల: పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పవర్‌లూమ్స్‌ కార్మికులు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మార్సీవద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు సుధాకర్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణ, మనోహర్‌, సురే్‌షబాబు, మహేష్‌, వెంకటేశు, బాబు, నాయకులు చంద్ర మోహన, శివయ్య, సురేంద్ర, కుల్లాయప్ప, ఈశ్వర్‌రెడ్డి, ఆది, గోపాల్‌, శ్రీనివాసులు, శివానంద, మోహన, కార్మికులు పాల్గొన్నారు.

సోమందేపల్లి: స్థానికంగా కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న ఆ ధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకం గా తీసుకుంటున్న చర్యలపై ఆయన మండిపడ్డారు. కనీస వేతనం అమ లు చేయడం లేదన్నారు. కార్మికులంతా ఏకమై ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్‌, చాంద్‌బా షా, శ్రీకాంత, గంగరాజు, హనుమయ్య, వెంకటేశ పాల్గొన్నారు.

రొద్దం: స్థానిక పావగడ సర్కిల్‌లో సీఐటీయూ నాయకులు, అంగనవాడీ కార్యకర్తలు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ఫకృద్దీన, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెనుకొండ: స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నాయకులు హరి, ర మేష్‌, బాబావలి, హమాలీ సంఘం నాయకులు నాగరాజు, భవన నిర్మాణ, తోపుడుబండ్ల కార్మికులు, అంగనవాడీ, ఆశ కార్యకర్తలు, నగర పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. సీపీఐ డివిజన కార్యదర్శి శ్రీ రాముల, ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలనీ, ఆటో యూనియన వద్ద జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన కార్యదర్శి కి ష్టప్ప, నరసింహులు, వెంకటేశులు, మల్లికార్జున, ఆటో కార్మికులు పాల్గొన్నా రు. యూటీఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, గౌరవాధ్యక్షుడు భూతన్న, ఉపాధ్యక్షులు బాబు, సుధాక ర్‌, భారతి, శ్రీనివాస్‌, నారాయణస్వామి చంద్రశేఖర్‌, నరేష్‌ తదితరులు జెండా ఆవిష్కరించారు. శ్రమను ప్రోత్సహిస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.

గుడిబండ: స్థానికంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. యానిమేటర్లు, ఆశ, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రొళ్ల: మండలకేంద్రంలో అంగనవాడీ కార్యకర్తలు, కార్మికులు ఎస్‌ఐ వెం కటరమణ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. బస్టాండులో మానవహారంగా ఏర్పడి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్తల అధ్యక్షురాలు ఇందిరాదేవి, కార్మికులు పాల్గొన్నారు.

పరిగి: స్థానిక గ్రామ సచివాలయం వద్ద సీఐటీయూ నాయకులు మే డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరించి, నినాదాలు చే శారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు, నాయకులు లింగారెడ్డి, ఆశ, అంగనవాడీ వర్కర్లు, హమాలీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-01T23:43:49+05:30 IST