రాష్ట్రంలో నియంత పాలన

ABN , First Publish Date - 2023-01-05T23:36:32+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని నియంత పాలన కొనసాగుతోం దని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో నియంత పాలన

మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, జనవరి 5: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని నియంత పాలన కొనసాగుతోం దని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ ఏకమై ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పం పర్యటనను అడుగడుగునా అడ్డుకో వడం నిబంధనల పేరుతో ఆంక్షలు పెట్టడం ముఖ్యమంత్రి సైకోయిజానికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో స్వాతంత్రోద్యమ కాలంనాటి పరిస్థితులు దాపురిం చాయని ఆరోపించారు. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్య్రం కొరవడిందని తన నియోజ కవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసు లు అడ్డుకోవడం శోచనీయమన్నారు. రోజురోజుకు పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి మడుగులు ఒత్తుతోందని పోలీసులు వైసీపీ కండువాలు వేసుకుంటే మం చిదని ఆరోపించారు.

Updated Date - 2023-01-05T23:36:34+05:30 IST