విద్యార్థులకు డిజిటల్ కష్టాలు
ABN , First Publish Date - 2023-04-03T23:54:32+05:30 IST
పట్టణంలో రెవెన్యూ పాలన గాడితప్పింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప లు ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. డిజిటల్ సంతకాల కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
అందని ధ్రువీకరణ పత్రాలు
తహసీల్దార్ లేక జారీలో ఆలస్యం
ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ముంచుకొస్తున్న గడువు
కార్యాలయాల చుట్టూ విద్యార్థుల ప్రదక్షిణ
హిందూపురం, ఏప్రిల్ 3: పట్టణంలో రెవెన్యూ పాలన గాడితప్పింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప లు ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. డిజిటల్ సంతకాల కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇంటర్ పరీక్షలు రాసినవారు పలు ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులతో పాటు విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జతచేయాల్సి ఉంది. వందలాది మంది వి ద్యార్థులు ఆయా సర్టిఫికెట్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే తహసీల్దార్ అందుబాటులో లేరు. దీంతో సం బంధిత అధికారి డిజిటల్ సంతకం లేకుండా సర్టిఫికెట్ల జారీ ని లిచిపోయింది. ఈపరిస్థితుల్లో విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొద్దిరోజులుగా హిందూపురానికి రె గ్యులర్ తహసీల్దార్‌ను నియమించలేదు. ఈకారణంగా ప్రస్తుతం వి ద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రోజులు గడుస్తున్నా ఎదురుచూపులే..
సాధారణంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చే సుకుంటే మూడు, నాలుగు రోజుల్లో చేరాలి. కానీ ఇక్కడ పనిచేస్తు న్న తహసీల్దార్‌లు మారుతుండటంతో పది రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి కూడా అందడంలేదు. దీనివల్ల రోజూ సచివాల యం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
తహసీల్దార్ బదిలీతో ఇబ్బందులు
హిందూపురానికి రెగ్యులర్ తహసీల్దార్‌గా ఉన్న శ్రీనివాసులు గత యేడాది ఆగస్టులో బదిలీపై వెళ్లారు. ఆ తరువాత చిలమత్తూరు త హసీల్దార్ కొద్దిరోజులు ఇనచార్జిగా వ్యవహరించారు. తదనంతరం డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న ప్రసాద్‌కు ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతుండేవాడు. ఇటీవలే ఆయన డీటీగా ఉద్యోగోన్నతి పొందడంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేసేవారు. ఈ తరుణంలో పరిగి తహసీల్దార్‌ను ఇనచార్జిగా నియమించారు. ఆమె కూ డా కొద్దిరోజులు పనిచేశారు. తాజాగా మూడు రోజుల క్రితం కొత్తచెరువు తహసీల్దార్‌ను ఇక్కడికి ఫుల్‌చార్జి కింద నియమించారు. ఆయ న కొత్తచెరువు, హిందూపురం బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది, దీనికితోడు కలెక్టరేట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటి కారణంగా వి ద్యార్థులకు సరైన సమయానికి సర్టిఫికెట్లు జారీ చేయడంలో వి ఫలమవుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలాఉంటే ఏపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముందుగా చేసుకుంటే మేలు చేకూరుతుందని అంటున్నారు. మొదట దరఖా స్తు చేసకున్న విద్యార్థులకు సమీపంలోనే సెంటర్లు కేటాయిస్తారు. ఆ లస్యం అయ్యేకొద్దీ విద్యార్థులకు దూర ప్రాంతాల్లో లేక ఇతర జిల్లాల్లో సెంటర్ వేస్తారు. ఉన్నతాధికారులు స్పందించి పట్టణానికి తహసీల్దార్ ఇనచార్జ్‌గా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పోస్టు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.