కంపోస్ట్ యార్డును తలపిస్తున్న డివైడర్లు
ABN , First Publish Date - 2023-04-17T23:41:50+05:30 IST
స్థానిక నగర పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్‌లు కంపోస్ట్‌యార్డును తలపిస్తు న్నాయి.
పెనుకొండ టౌన, ఏప్రిల్ 17: స్థానిక నగర పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్‌లు కంపోస్ట్‌యార్డును తలపిస్తు న్నాయి. పట్టణ సుందరీకరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయల వై-జం క్షన నుంచి ఆర్టీసీ డిపో వరకు డబుల్ రోడ్డును ఏర్పాటు చేసి, డివైడర్‌లు నిర్మించారు. ఐదో వార్డు సమీపంలో ఉన్న డివైడర్‌పై చుట్టుపక్కల వారు, షాపుల యజమానులు, స్థానికులు చెత్తాచెదారాన్ని డివైడర్ల మధ్యలోనే వేస్తున్నారు. డివైడర్లపైన ఉన్న చెత్తకుప్పల వద్దకు కుక్క లు, పందులు చేరి మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. మరో వైపు ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, పాదచారులు దుర్ఘం ధంతో అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. చెత్తా చెదారం వద్దపశువులు, క్కులు రావడంతో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల ఓ త్విచక్ర వాహనదారుడు కిందపడి గాయపడిన సంఘటనలూ ఉ న్నాయి. ఇప్పటికైనా ఈవార్డు పరిధిలో చెత్త వేయడానికి డస్టుబినలు ఏర్పాటు చేయాలని, పట్టణ సుందరీకరణ, పరిశుభ్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం
వంశీకృష్ణ భార్గవ్, కమిషనర్, పెనుకొండ
ఇంటింటి నుంచి చెత్త తరలించేందుకు ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశాం. అయినా కొందరు పని క ట్టుకుని చెత్తను రోడ్లపై వేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుంటాం. తక్షణమే సిబ్బందిని పంపి డస్టుబినలు ఏర్పాటు చేస్తాం.