తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు

ABN , First Publish Date - 2023-06-11T00:03:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామా న్య ప్రజలపై కరెంటు బిల్లుల భారం తడిసిమోపెడవుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య విమర్శించారు.

తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు

వైసీపీ పాలనలో 9 సార్లు చార్జీల పెంపు : టీడీపీ

ధర్మవరం, జూన 10: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామా న్య ప్రజలపై కరెంటు బిల్లుల భారం తడిసిమోపెడవుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలపై వివిధ రకాల పన్ను లు, చార్జీలు మోపుతోందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-19లో ఐదేళ్లలో ఒక్క నయాపైసా కూడా కరెంటు చార్జీలు పెంచలేదని, నాణ్యమైన విద్యుత్తును అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. వైసీపీ నాలుగేళ్లలో ప్రజల వద్ద నుంచి రూ.57వేల కోట్లు విద్యుత్తు అదనపు చార్జీల పేరుతో వసూళ్లకు పాల్పడుతోందన్నారు. ఏటా 15 శాతం ఇంటిపన్ను పెంపు, చెత్తపన్ను విధించారన్నారు. పెంచిన విద్యుత్తు చార్జీలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో టీడీపీ అధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు కాచర్ల కంచన్న, మేకల రామాంజినేయులు, నాగూర్‌ హుస్సేన, రాళ్లపల్లిషరీఫ్‌, అంబటి సనత, కేశగాళ్ల శ్రీనివాసులు, అత్తర్‌ రహీంబాషా, చట్టా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

విద్యుత్తు చార్జీల ముసుగులో అదనపు వసూళ్లు

కొత్తచెరువు: వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు చార్జీలు వడ్డించిందని, ఆపై అదనపు వసూళ్లకు తెగబడుతూ ప్రజలను దోపిడీ చేస్తోందని టీడీపీ పార్లమెంట్‌ అధికారప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు విమర్శించారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్తు కోతలతో ఇబ్బందులుపడుతున్న ప్రజలకు, చార్జీల పెంపు మరింత భారమైందన్నారు. వైసీపీ రాష్ట్రంలో ఎక్కడా ఒక పరిశ్రమను కూడా తెచ్చిన దాఖలాలు కనిపించలేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల, పట్టణ కన్వీనర్లు రామకృష్ణ, ఒలిపి శ్రీనివాసులు, మాజీ సర్పంచులు మాణిక్యం బాబా, సుబ్రహ్మణ్యం, నాయకులు బండ్లపల్లిరాజు, షర్పుద్దీన, సైకిల్‌షాపు బాబా, నాగేంద్రప్రసాద్‌, చాకలి సుబ్బరాయుడు, పెద్దన్న పాల్గొన్నారు.

బాదుడు సీఎంను సాగనంపుదాం

ఓబుళదేవరచెరువు: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల ధరలు, చార్జీలు పెంచి ప్రజలను బాదుతున్న సీఎం జగనను సాగనంపుదామని టీడీపీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు బూదిలి ఓబులరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లుగా ప్రజలను ఏదోవిధ ంగా బాదుతూనే ఉందన్నారు. నిత్యావసర వస్తువులు, విద్యుత చార్జీలు పలుమార్లు పెంచి ప్రజలపై భారం మోపుతోందన్నారు. వెంటనే పెంచిన చార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు నిజాం, మైనార్టీ సెల్‌ మండలాధ్యక్షుడు చికెనషానూ, మాజీ కన్వీనర్‌ రాజారెడ్డి, నాయకులు ఆంజనరెడ్డి, నాగేంద్రకుమార్‌, డ్రిప్‌ నాగరాజు, చంద్ర, నారప్పరెడ్డి, కంచి సురేష్‌, తెలుగు మహిళ నాయకురాలు మస్తానమ్మ, సొసైటీ మాజీ డైరెక్టర్‌ మండోజీ ఆర్షీఖాన, సౌదీ నాగరాజు పాల్గొన్నారు.

విద్యుత్తు చార్జీలు తగ్గించాలి

నల్లమాడ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలు వెంటనే త గ్గించాలని టీడీపీ మండల కన్వీనర్‌ మైలే శివ శంకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలుసార్లు విద్యుత్తు చార్జీలు పెంచిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటూ, నిరుపేదల నడ్డి విరుస్తున్నారని వాపోయారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపుతో పేదలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బుట్టి నాగభూషణం నాయుడు, పుట్ల రవీంద్ర, శివారెడ్డి, అబ్బాస్‌ ఖాన, బాబావలి, నాగేనాయక్‌, విష్ణు, ప్రతాప్‌, శ్రీనివాసరెడ్డి, శీనా, నరసింహులు, రవి, విశ్వనాథ, అరవిద్‌ పాల్గొన్నారు.

ప్రజలపై రూ.3వేల కోట్ల విద్యుత్తు భారం

బుక్కపట్నం: పెంచిన విద్యుత సర్‌ చార్జీలు, అదనపు బాదుడుతో ప్రజలపై ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా భారం మోపుతోందని మండల టీడీపీ నాయకులు విమర్శించారు. శనివారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ, బాదుడు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇప్పటికే ఏడు దఫాలుగా విద్యుత చార్జీలుపెంచిందన్నారు. ఆపై కస్టమర్‌ చార్జీలు, ట్రూఆఫ్‌ చార్జీల పేరుతో ప్రజలకు షాక్‌ ఇస్తోందన్నారు. టీడీపీ పాలనలో లోటు విద్యుత నుంచి మిగులు విద్యుత స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చామన్నారు. వైసీపీ పాలనలో కరెంటు కోతలు, విద్యుత బిల్లుల భారమే మిగిలిందని వాపోయారు. సమావేశంలో మండల కన్వీనర్‌ చింతా మల్లిరెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు లావణ్యగౌడ్‌, టౌన కన్వీనర్‌ జంగం వెంకటరాముడు, నాయకులు సయ్యద్‌బాషా, కేశవనాయుడు, శ్రీరాములు, వాజీద్‌ పాల్గొన్నారు.

విద్యుత చార్జీలతో రైతులకు ఉరితాళ్లు

అమడగూరు: విద్యుత చార్జీల భారం రైతులకు ఉరితాళ్లు వేస్తోందని మండల టీడీపీ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి విమర్శించారు. పేదలు, రైతులపై పెనుభారం మోపడం సీఎం జగనకు ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో జగన ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ధరలు పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని, విద్యుత మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడలకు ఉరితాడు బిగిస్తున్నారన్నారు. టీడీపీ పానలలో రూ.50 నుంచి వంద వస్తున్న కరెంటు బిల్లు... నేడు రూ.ఐదువందలు, వెయ్యి వరకు పెంచుతున్నారన్నారు. పెంచిన విద్యుత చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు క్రిష్ణారెడ్డి, కుమార్‌రెడ్డి, నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శి టైలర్‌ రామాంజులు, మారుతి, మస్తానప్ప, అశోక్‌, జయరాం, పద్మనాభం, బోరు హనుమంతురెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

విద్యుత్తు రంగం... నిర్వీర్యం

పుట్టపర్తిరూరల్‌: వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్తు రంగం నిర్వీర్యమైందని టీడీపీ పట్టణ కన్వీనర్‌ రామాంజినేయులు విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గృహ అవసరాలు, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించామన్నారు. కోతలు లేకుండా, విద్యుత చార్జీలు పెంపు లేకుండా చంద్రబాబు సుపరిపాలన అందించారని అన్నారు. జగనరెడ్డి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చాక, అనాలోచిత నిర్ణయాలు, రివర్స్‌పాలనతో విద్యుతరంగాన్ని భ్రష్టుపట్టించారన్నారు. విద్యుతచార్జీలు పెంచి ప్రజల నడ్డివిరగ్గొట్టాడన్నారు. ఇవి చాలవన్నట్లు వ్యవసాయ మోటార్లకు మీటర్లు ప్రతిపాదన తెచ్చి రైతులను నట్టేటముంచడానికి పథకం రచిస్తున్నాడని విమర్శించారు. సమావేశంలో నాయకులు సామకోటి ఆదినారాయణ, మహ్మద్‌రఫీ, కోనంకి నాయుడు, చంద్రశేఖర్‌, అమ్మినేని కేశవ, అంబులెన్సు రమేష్‌, మనోహర్‌మాల, శ్రీరాములు, బేకరి నాయుడు, భీమినేని కిష్టప్ప, గుట్లపల్లి గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:03:43+05:30 IST