ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఎనఎంయూ
ABN , First Publish Date - 2023-06-15T00:17:59+05:30 IST
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు.
ధర్మవరం/పుట్టపర్తిరూరల్, జూన 14: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం యూనియన ఆధ్వర్యంలో ఉద్యోగులు డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అప్పీళ్ల పరిష్కారం, అక్రమ బదిలీలు, సస్పెన్షన్లు, ఏఏఎస్ ఇంక్రిమెంట్లు, పీఆర్‌సీ అరియర్స్ విషయంలో ఆర్‌ఎం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విధులు ఎంటీడబ్ల్యూ యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. నిరసనలో జోనల్ నాయకులు వైజే ప్రేమ్‌కుమార్, రీజనల్ నాయకులు నీళ్ల శంకరయ్య, దుర్గాప్రసాద్, డిపో అఽధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, మధుసూదన గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శులు డీఆర్ కుమార్, హరికృష్ణ పాల్గొన్నారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో ఎదుట ఎనఎంయూ జోనల్ జాయింట్ సెక్రటరీ శ్రీరామనాయక్, రీజనల్ సెక్రటరీ షబ్బీర్, చీఫ్ అడ్వైజర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో డీపీటీఓ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు రీజనల్ ఉపాధ్యక్షురాలు తిరుపతమ్మ, నాయకులు చండ్రాయుడు, శివశంకర్, బాబ్జాన, కేఆర్ చారి, స్వర్ణమ్మ, కార్మికులు పాల్గొన్నారు.