మందులు లేని ఈఎ్‌సఐ ఆసుపత్రి

ABN , First Publish Date - 2023-04-03T00:09:40+05:30 IST

వివిధ కార్మాగారాలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈఎ్‌సఐ ఆసుపత్రిని పట్టణంలో ఏర్పాటు చేసింది. ఇటీవల కార్మికులకు ఈ ఆసుపత్రిలో ఎటువంటి వైద్యం అందడంలేదని ఆవేదన చెందుతున్నా రు.

మందులు లేని ఈఎ్‌సఐ ఆసుపత్రి

కార్మికులకు అందని వైద్యం

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 2: వివిధ కార్మాగారాలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈఎ్‌సఐ ఆసుపత్రిని పట్టణంలో ఏర్పాటు చేసింది. ఇటీవల కార్మికులకు ఈ ఆసుపత్రిలో ఎటువంటి వైద్యం అందడంలేదని ఆవేదన చెందుతున్నా రు. కనీసం బీపీ, షుగర్‌ మాత్రలు కూడా ఇవ్వడంలేని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది ముందే ఈఎ్‌సఐ ప్రీమియం సొమ్ము తీసుకుంటున్నారని తెలిపారు. వ్యయప్రయాసలు పడి ఎం తో దూరం నుంచి ఈఎ్‌సఐ ఆసుపత్రికి వస్తే, ఇక్కడ సాధారణ జ బ్బులకు కూడా మందులు దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. కార్మికులకు సక్రమంగా మందులు అందించలేని ఈఎ్‌సఐ ఎందుకు ని ర్వహిస్తున్నారో అర్థం కావడంలేదని ఆగ్రహిస్తున్నారు. దూరం నుం చి వచ్చి మందులు లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అ వసరం మేరకు బయట కొనుగోలు చేయడమో, లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడంమో జరుగుతోందని కార్మికులు అం టున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యం లో పెద్దఎత్తున నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

బీపీ, షుగర్‌ మాత్రలు కూడా లేవు..

రంగప్ప, కార్మికుడు

నాకు బీపీ, షుగర్‌ ఉంది. మాత్రల కోసం ప్రతిసారి 4 కిలో మీ టర్ల దూరం నుంచి ఈఎ్‌సఐ ఆసుపత్రికి వస్తాను. తీరా ఇక్కడకు వ స్తే మాత్రలు లేవంటున్నారు. బీపీ, షుగర్‌ మాత్రలు కూడా అందించకపోతే ఇక ఆసుపత్రి ఎందుకుంది. మా వేతనాల నుంచి నెలనెలా సొమ్ము తీసుకుంటున్నా వైద్యం అందించడం లేదు.

Updated Date - 2023-04-03T00:09:40+05:30 IST