అభిమాని.. చెన్నమ్మ

ABN , First Publish Date - 2023-03-31T23:54:35+05:30 IST

టీడీపీ వీరాభిమాని.. 80 ఏళ్ల చెన్నమ్మ నారా లోకేశ పాదయాత్రలో శుక్రవారం 12 కి.మీ. పైగా నడిచారు. సీకే పల్లి నుంచి ప్యాదిండి విడిది కేంద్రం వరకూ జెండా పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు.

అభిమాని.. చెన్నమ్మ
పాదయాత్రలో పాల్గొన్న చెన్నమ్మ

ధర్మవరం రూరల్‌ : టీడీపీ వీరాభిమాని.. 80 ఏళ్ల చెన్నమ్మ నారా లోకేశ పాదయాత్రలో శుక్రవారం 12 కి.మీ. పైగా నడిచారు. సీకే పల్లి నుంచి ప్యాదిండి విడిది కేంద్రం వరకూ జెండా పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. జై ఎన్టీఆర్‌, జై చంద్రబాబు అని నినదిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. చెన్నమ్మను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన స్థాపించిన పార్టీలో మొదటి నుంచి ఉన్నానని, తుది శ్వాస విడిచేవరకూ పార్టీతోనే నడుస్తానని చెన్నమ్మ పేర్కొంది. ఎన్టీఆర్‌ హయాంలో తనకు పింఛన వచ్చిందని, చంద్రబాబు రూ.2 వేలు పింఛన ఇచ్చారని సంతోషంగా తెలిపింది.

Updated Date - 2023-03-31T23:54:35+05:30 IST