వేరుశనగ సాగుకు రైతుల వెనుకంజ
ABN , First Publish Date - 2023-05-21T23:55:24+05:30 IST
ఈ యేడాది ఖరీఫ్ సీజనలో వేరుశనగ సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు.
గతేడాది 600 ఎకరాల్లోనే పంట
పెనుకొండ రూరల్, మే 21: ఈ యేడాది ఖరీఫ్ సీజనలో వేరుశనగ సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. పంటసాగుకు పెట్టుబడు లు పెరగడం, సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, సాగుచేసి న పంటలకు తుపాను, భారీ వర్షాల కారణంతో పంట దిగుబడులు అందకపోవడంతో రైతులు వేరుశనగ సాగుకు ఈ యేడాది వెనుకంజ వేస్తున్నారు. మండలంలో 18 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. గత యేడాది 600 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ పంట సాగుచేసినట్లు వ్య వసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ యేడాది ఖరీఫ్ సీజన ప్రా రంభమైంది. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. నాలుగు రోజుల క్రితం వ్యవసాయాధికారులు మండల వ్యా ప్తంగా ఆయా రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తన కాయల కో సం రిజిస్ర్టేషనల ప్రక్రియ ప్రారంభించారు. పెనుకొండ మండలానికి 1500 క్వింటాళ్లు వేరుశనగ విత్తన కాయలు కేటాయించారు. అర ఎ కరా పొలం ఉన్న రైతులకు 30 కేజీల బస్తా ధర రూ.1674, ఎకరం ఉ న్నవారికి 60 కేజీలు రూ.3348, ఎకరానికి పైగా ఉన్న రైతులకు 90 కే జీల ధర రూ.5022లు 40శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలు రైతులకు అందజేస్తుంది. నాలుగు రోజుల నుంచి మండలంలో 105 మంది 280 బస్తాలకు మాత్రమే రిజిస్ర్టేషన చేసుకున్నారు. ఈనెలాఖరులోగా రిజిస్ర్టేషన చేసుకున్న రైతులకు విత్తన పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా వేరుశనగ పంట సాగుచేసి తీవ్ర నష్టాన్ని చూసిన రైతన్నలు... ఈ యేడాది కూడా వేరుశనగ సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.
వేరుశనగ సాగుతో రూ.లక్ష నష్టపోయా..
శ్రీనివాసులు, రైతు, కోనాపురం
గత యేడాది ఐదెకరాల్లో వేరుశనగ పంట సాగుచేశా. పంటకు విత్తన కొనుగోలు, ఎరువులు, పెట్టుబడి ఎకరాకు రూ.35వేల చొప్పున ఐదెకరాలకు రూ.1.80 లక్షలు ఖర్చుచేశా.పంట ఊడలదశ మొదలైనప్పటి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు వేరుశనగ పంటకు మువ్వకుళ్లు తెగులు సోకి పంట దెబ్బతింది. దీంతో దాదాపు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది. అందుకే ఈసారి వేరుశనగకు బదులు ప్రత్యామ్నా య పంటలు సాగుచేస్తున్నా.