గాలి బీభత్సం
ABN , First Publish Date - 2023-06-12T00:13:31+05:30 IST
మండలవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విద్యుత స్తంభం, తుమ్మచెట్లు నేలకొరిగాయి.
కూలిన విద్యుత స్తంభం, చెట్లు
స్తంభించిన రాకపోకలు
అమడగూరు, జూన 11: మండలవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విద్యుత స్తంభం, తుమ్మచెట్లు నేలకొరిగాయి. తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెరువు కట్టపైన తుమ్మచెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. చెట్టు విద్యుత తీగలపై పడడంతో అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న విద్యుత స్తంభం విరిగి పడింది. విద్యుత తీగలు నేలపై పడ్డాయి. స్థానికులు గమనించి విద్యుత అఽధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత సరఫరా నిలిపివేశారు. చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలడంతో అమడగూరు నుంచి బిళ్లూరు, చినగానిపల్లి, రెడ్డివారిపల్లి, బాగేపల్లి గ్రామాలకు వెళే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.