బాబుతోనే రాషా్ట్రనికి బంగారు భవిష్యత్తు : టీడీపీ
ABN , First Publish Date - 2023-12-09T00:00:34+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తోనే రాషా్ట్రనికి బంగారు భవిష్యత్తు అని టీ డీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు.
మడకశిర రూరల్, డిసెంబరు8: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తోనే రాషా్ట్రనికి బంగారు భవిష్యత్తు అని టీ డీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. మండలంలోని తురుకవాండ్లపల్లిలో శుక్రవారం టీడీపీ,జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ మీనీ మేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపై ప్రజలకు తెలియజేశారు. అనంతరం మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీచేశారు. కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళీబాబు, నాయకులు శివన్న, రంగప్ప, ఆంజనేయులు, తిరుమలేశ, గంగాధర్, జనసేన నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.
మడకశిరటౌన: పేదలు, రాష్ట్రం అన్ని రంగాల్లో అబివృద్ది చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు ఆర్ జయకుమార్ అన్నారు. అమరాపురం మండల కేంద్రంలో శుక్రవారం బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్సేస్వా మి ఆదేశాల మేరకు నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు నాగరాజు, బీసీ సెల్ ధనుంజయ, టీఎనటీయూసీ నాయకుడు యంజారప్ప, క్లస్టర్ ఇనచార్జి రవికుమార్, లింగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.