భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

ABN , First Publish Date - 2023-04-07T23:58:46+05:30 IST

జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చ ర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 7: జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చ ర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు భక్తులకు ఏసు సందేశా న్ని బోధించారు. హిందూపురంలోని సీఅండ్‌ఐజీ మిషన కాంపౌండ్‌ చర్చిలో పాస్టర్‌ రెవరెండ్‌ స్టీఫెనరాజ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వ హించారు. ఈసందర్భంగా పాస్టర్‌ మాట్లాడుతూ సమస్త మానవాళికి మంచి చేయాలనే తలంపుతో శిలువ అయిన త్యాగమూర్తి ఏ సు పరలోక యాత్రను గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారని పేర్కొన్నారు. శాంతి మార్గంలో అందరూ పయనించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి నాగేంద్రకుమార్‌, కోశాధికారి ఆదర్శకుమార్‌, సంయుక్త కార్యదర్శి క్రిస్టఫర్‌, సభ్యులు ఆనంద్‌రాజ్‌, విక్టర్‌ జాషువా, జాన్సన, జార్జిబాబు, క్రైస్తవులు పాల్గొన్నారు.

పెనుకొండ: స్థానిక సీఅండ్‌ఐజీ బైబిల్‌ మిషన చర్చిలో క్రైస్తవు లు గుడ్‌ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. ఫాస్టర్లు ఫ్రాన్సెస్‌, సుధాకర్‌ క్రీస్తు బోధనలు వివరించారు. యేసుక్రీస్తు శిలువ వేసి చనిపోతూ, శారీరక బా ధను అనుభవిస్తూ కూడా ఆయన ప్రపంచానికి అందించిన ఏడు ముఖ్యమైన ప్రవచనాలను చదివి వినిపించారు.

మడకశిర టౌన: పట్టణంలోని సీఅండ్‌ఐజీ చర్చిలో గుడ్‌ఫ్రైడే ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు ఉపవాస దీక్ష చేపట్టి సాయంత్రం విరమించారు. పాస్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - 2023-04-07T23:58:46+05:30 IST