హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
ABN , First Publish Date - 2023-01-10T00:13:13+05:30 IST
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటూ వక్తలు మండిపడ్డారు. హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, వసతులు కల్పించాలంటూ ఏఐఎ్‌సఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఒక రోజు రిలేదీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్ వద్ద ఏఐఎ్‌సఎఫ్ నేతల రిలే దీక్షలు
అనంతపురం విద్య, జనవరి 9: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటూ వక్తలు మండిపడ్డారు. హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, వసతులు కల్పించాలంటూ ఏఐఎ్‌సఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఒక రోజు రిలేదీక్ష నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వామి, ప్రధానకార్యదర్శి చిరంజీవి, సహాయకార్యదర్శులు రమణయ్య, హనుమంతు, ఇతర నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలు చేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, మాజీ నాయకులు నారాయణస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతో్‌సకుమార్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఎనఎ్‌సయూఐ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి నరేష్, ఇతర నాయకులు వారికి మద్దతు తెలిపారు. సాయంత్రం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ రిలేదీక్షల్లో పాల్గొన్నవారికి పండ్ల రసం అందించి దీక్ష విరమింపజేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ హాస్టళ్లను విస్మరించారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు వీరేంద్ర,యోగేంద్ర, పృథ్వీ, వంశీ, కార్తీక్, రాజు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.