కదంతొక్కిన చేనేత కార్మికులు

ABN , First Publish Date - 2023-06-07T23:58:26+05:30 IST

పవర్‌లూమ్స్‌లో ప్యూర్‌ టూ ప్యూర్‌ నేయరాదం టూ ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలో కా ర్మికులు కదంతొక్కారు.

కదంతొక్కిన చేనేత కార్మికులు

ఉద్రిక్తతకు దారితీసిన ఆందోళన

నాయకుల అరెస్టు

ధర్మవరం, జూన 7: పవర్‌లూమ్స్‌లో ప్యూర్‌ టూ ప్యూర్‌ నేయరాదం టూ ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలో కా ర్మికులు కదంతొక్కారు. బుధవారం పట్టణంలో పెద్దఎత్తున తరలివచ్చిన చేనేత కార్మికులతో ర్యాలీ చేపట్టారు. గాంధీనగర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీగా కళాజ్యోతి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. రా స్తారోకో, ధర్నాకు దిగారు. పవర్‌లూమ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హో రెత్తించారు. ట్రాఫిక్‌ స్తంభించింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏవైనా సమస్యలుంటే అధికారులతో మాట్లాడాలని, ఇలా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయరాదని, వెంటనే విరమించాలని ఆందోళనకారులకు సీఐ సర్దిచెప్పారు. అయినా నిరసనకా రులు ససేమిరా అన్నారు. ఆర్డీఓ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ధర్నా విరమించబోమని భీష్మించి కూర్చున్నారు. పోలీసులతో నాయకు లు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసు లు ఆందోళనకారులను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషనకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకుముందు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మికసం ఘం తాలూకా అధ్యక్షుడు వెంకటస్వామి కార్మికులను ఉద్దేశించి మాట్లా డారు. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. పవర్‌లూమ్స్‌లో చేనేత రకాలు నేయడం వల్ల చేనేతకు తీవ్ర సంక్షోభం పట్టుకుందన్నారు. పవర్‌లూమ్స్‌లో మిక్సింగ్‌ మాత్రమే నేసుకోవాలన్న నిబంధనలు ఉన్నా, తుంగలోకి తొక్కి ప్యూర్‌ టూ ప్యూర్‌ నేస్తున్న చేనేత కార్మికుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారు లు వారికి వత్తాసు పలుతున్నారని ఆరోపించారు. చేనేత కార్మికులను ఆ త్మహత్యల బారినుంచి కాపాడాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు గంగాధర్‌, శ్రీనివాసులు, లోకేశ, వెంకటనారాయణ, శేఖర, రాజు, మంజు, గోవర్దన, చింతా శ్రీనివాసులు, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యవర్గసభ్యు లు విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:58:26+05:30 IST