భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2023-06-08T00:02:51+05:30 IST

తనకల్లు, అమడగూరు మండ లాల పరిధిలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు భారీగా పట్టుకున్నారు.

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

తనకల్లు/అమడగూరు, జూన 7: తనకల్లు, అమడగూరు మండ లాల పరిధిలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు భారీగా పట్టుకున్నారు. తనకల్లు మండలం ఈతోడు క్రాస్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రాంభూపాల్‌ తెలిపారు. ఎగువ బత్తినవారిపల్లికి చెందిన వలిపి మధు, గోపాల్‌నాయక్‌ తండాకు చెందిన మూడే సాయినాయక్‌, బూకె భరతనాయక్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 12 కేసుల మద్యం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చే సుకున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్‌ రాధాక్రిష్ణగౌడ్‌, శి వ, పోలీసులు రంజితకుమార్‌నాయక్‌, నారాయణస్వామి, వెంకటేష్‌, అ స్రఫ్‌, ఆంజనేయులు, హోంగార్డు వేమనారాయణనాయక్‌, రవి, కిరణ్‌, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అమడగూరు మండలం మలకవారిపల్లికి చెందిన రవినాయక్‌ అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు. మలకవారిపల్లి క్రా స్‌లో తనిఖీలు చేస్తుండగా, రవినాయక్‌ వద్ద 148 మద్యం టెట్రా పాకె ట్లు, 46 బీర్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - 2023-06-08T00:02:51+05:30 IST