పేదలకు ఇంటిస్థలాలు, భూపంపిణీ చేపట్టాలి
ABN , First Publish Date - 2023-06-14T00:19:58+05:30 IST
పేదలందరికి ఇళ్లస్థలాలు, భూ పంపిణీ చేయాలని, లేనిపక్షంలో భూ పోరాటాలు చేస్తామని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య
పుట్టపర్తి, జూన 13: పేదలందరికి ఇళ్లస్థలాలు, భూ పంపిణీ చేయాలని, లేనిపక్షంలో భూ పోరాటాలు చేస్తామని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రైల్వేస్టేషన వద్ద పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తామంటూ నిరసనకు దిగారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పి, ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేక పోయారన్నారు. నాలుగేళ్ల పాటు మాటలతోనే కాలయాపన చేశారని, కనీసం గత ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిన టిడ్కో గృహాలను సైతం పేదలకు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కొత్తచెరువు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 483లో ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పేదలకు భూ పంపిణీ, ఇంటిస్థలాలు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, నాయకులు రామాంజినేయులు, గంగాధర్, రమణ, రాజేంద్రప్రసాద్, మధునాయక్, మధు, గౌ్‌సలాజం పాల్గొన్నారు.