పాలన సాగేదెలా?
ABN , First Publish Date - 2023-05-20T00:15:21+05:30 IST
మండలంలో కొంతకాలంగా ఇనచార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. మెరుగైన సేవలందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో పలు పోస్టులు భర్తీకి నోచు కోలేదు.
ఏళ్లకాలంగా ఇనచార్జి అధికారులే దిక్కు
ప్రభుత్వ సేవల్లో ఆలస్యం
కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణ
చిలమత్తూరు, మే 19: మండలంలో కొంతకాలంగా ఇనచార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. మెరుగైన సేవలందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో పలు పోస్టులు భర్తీకి నోచు కోలేదు. ఆయా స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో ఇనచార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా పాలన కుంటుపడుతోందన్న విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ఎంపీడీఓ సుధామణి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి, ఆతర్వాత కది రి రూరల్ ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఏడాదిగా ఎవరినీ ని యమించలేదు. మండ ల పరిషత సూపరింటెండెంట్ రామ్‌కుమార్‌కు ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఎంఈఓ పోస్టు రెండేళ్లుగా ఇనచార్జి అధికారి పాలనలోనే కొనసాగుతోంది.
12 పంచాయతీలకు ఐదుగురు కార్యదర్శులే..
మండలంలో కొన్నేళ్లుగా పలు గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. 12 పంచాయతీలకు గాను కేవలం ఐదుగురు మాత్రమే కార్యదర్శు లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కార్యదర్శి రెండు నుంచి మూడు పంచాయతీలకు ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. చిలమత్తూరు, కోడూరు మేజర్ పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శులు లేరు. పక్క పంచాయతీల కార్యదర్శు లను ఇనచార్జిలుగా నియమించారు. కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నాగరాజుకు సొంత పంచాయతీ కొడికొండతో పాటు అదనంగా కో డూరు, చిలమత్తూరు, దిగువపల్లి పంచాయతీలు అప్పగించారు. శెట్టిపల్లి కా ర్యదర్శిగా పనిచేస్తున్న జితేంద్రనాయక్‌కు సొంత శెట్టిపల్లితో పాటు అదనంగా దేమకేతేపల్లి, టేకులోడు పంచాయతీలను అప్పగించారు. మొరసలపల్లి కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్‌నాయక్‌కు అదనంగా చాగలేరు, పలగలపల్లి పంచాయతీలను అప్పగించారు.
రెవెన్యూలోనూ అదేతీరు..
తహసీల్దార్ కార్యాలయంలోనూ ఇనచార్జిల పాలన సాగుతోంది. ఒక్కో సచివాలయానికి ఒక్కో వీఆర్వో ఉండాల్సి ఉండగా, పలుచోట్ల ఇనచార్జిలే పనిచేస్తున్నారు. కొడికొండకు రెగ్యులర్ వీఆర్వోగా ఉన్న రవిశేఖరరెడ్డికి అదనంగా సో మఘట్ట బాధ్యతలు తీసుకున్నారు. చిలమత్తూరు-1 వీఆర్వోగా ఉన్న సురేష్ సె లవులో వెళ్లారు. టేకులోడు వీఆర్వో అశ్వర్థప్ప అదనంగా చాగలేరు బాధ్యతలు తీసుకున్నారు. మండలంలో రెండు ఆర్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల బదిలీల్లో భాగంగా దుర్గేష్ వచ్చి చేరినా ఫలితం లేకపోయింది. ఆయన మూ డు నెలల పాటు పనిచేసి, అనంతరం సెలవుపై వెళ్లిపోయారు. మరో ఆర్‌ఐ స్థానం ఏడాదిన్నర కాలంగా ఖాళీగానే పడింది. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. అదేవిధంగా ప్రజా పౌరసరఫరాల శాఖ సీఎ్‌సడీటీ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో పౌరసరఫరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంప్యూటర్ అపరేటర్ స్థా నానిదీ ఇదే పరిస్థితి. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరులో జాప్యం జరుగుతోంది. మండలంలో ఇద్దరు వీఆర్వో పో స్టులు కొన్నాళ్లుగా ఖాళీగానే ఉన్నాయి.
సర్దుకుపోవడం కష్టమే..
మండలంలో పనిచేయడానికి ఎవరు వచ్చినా అధికార పార్టీ నాయకులతో సర్దుకుపోవడం ఉద్యోగులకు తల ప్రాణం తోకకు వస్తోందన్న వాదన ఉంది. అధికార వైసీపీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే ఉన్న అధికారులు... ఏ వర్గం నాయకుల మాటలు వినాలో, ఎవరి మాట వినకూడదో తెలియక సతమతమవుతున్నారు. ఒక వర్గం వారితో సన్నిహితంగా ఉంటే, మరో వర్గం వారు జీర్ణించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో బదిలీలపై వచ్చే ఉద్యోగులు అన్నింటికి సిద్ధపడి ఇక్కడకు రావాల్సి ఉంది. అధికార పార్టీలోని వర్గపోరు అధికారులపై తీవ్రమైన ప్రభావం చూపుతోందన్న విమర్శలున్నాయి.
పని భారం పెరిగింది
నాగరాజు, కొడికొండ పంచాయతీ కార్యదర్శి
పక్కనున్న పంచాయతీలకు ఇనచార్జి బాధ్యతలు ఇవ్వడంతో మరింత పని భారం పెరిగింది. కార్యదర్శు ల కొరతతో ఉన్నతాధికారులు తమకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నిమిషం కృషి చేస్తున్నాం. మూ డు పంచాయతీలకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించడంతో కొంత పనిభారం పెరిగినా, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నాం.
ఇనచార్జిలతో ఇబ్బందులు తప్పడం లేదు
ప్రవీణ్‌కుమార్, సీపీఎం నాయకులు
పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలకు ఇనచార్జి అ ధికారులను నియమించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోరోజు ఒక్కో పంచాయతీ లో విధులు నిర్వహించాల్సి రావడంతో అత్యవసర స మయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇనచార్జిల స్థానంలో రెగ్యులర్ అధికారులను నియమించి, ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలి.
సేవలు ఆలస్యమవుతున్నాయి..
-వేణుగోపాల్, దేమకేతేపల్లి
పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలకు ఇనచార్జిలను నియమించడంతో ప్రజలకు సత్వరమే అందాల్సిన సే వలు ఆలస్యమవుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే వెంటనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇనచార్జి అధికారుల కోసం చిన్నపనైనా కార్యాలయాలు చుట్టూ తిరగడం తప్పడం లే దు. ఇప్పటికైనారెగ్యులర్ ఉద్యోగులను నియమించాలి