నిలువ నీడ లేక.. ప్రయాణికుల అవస్థలు
ABN , First Publish Date - 2023-05-09T23:54:09+05:30 IST
నియోజకవర్గ కేంద్రమైన మడకశిర ప్రైవేట్ బ స్టాండ్‌లో కనీససౌకర్యాలు మృగ్యమయ్యాయి. ఏళ్లకాలంగా ప్రయాణికు ల అవస్థలు తీరడం లేదు. ఎండావానకు నిలువ నీడలేక నిరీక్షించా ల్సిందే.
మడకశిర, మే 9: నియోజకవర్గ కేంద్రమైన మడకశిర ప్రైవేట్ బ స్టాండ్‌లో కనీససౌకర్యాలు మృగ్యమయ్యాయి. ఏళ్లకాలంగా ప్రయాణికు ల అవస్థలు తీరడం లేదు. ఎండావానకు నిలువ నీడలేక నిరీక్షించా ల్సిందే. పట్టణంలోని అమరాపురం బస్టాండు, నాలుగు కూడళ్ల సర్కిల్, బస్‌స్టాప్‌ల వద్ద కనీసం షెల్టర్‌లు లేవు. ఇతర ప్రాంతాల నుంచి రా కపోకలు సాగించే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇటీవల చేప ట్టిన రోడ్ల విస్తరణలో ఉన్న చెట్లనూ కూలదోశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.50 కోట్ల ని ధులు మంజూరు చేశారు. 70 శాతం పనులు చేపట్టారు. మిగతా 30 శాతం పనులు స్తంభించాయి. అమరాపురం బస్టాండులో ఎక్కడ నీడ ఉంటే అక్కడకు వెళ్ళి నిలబడే పరిస్థితి నెలకుందని ప్రయాణికులు ఆ వేదన చెందుతున్నారు. ఆర్‌టీసీ బస్టాండు పట్టణానికి దూరంగా ఉం డడంతో ప్రయాణికులకు సౌకర్యంగా లేదు. దీంతో ప్రయాణికులు అ మరాపురం బస్టాండు, మధుగిరి సర్కిల్, పావగడ రోడ్డు, హిందూపు రం రోడ్డు కూడళ్లలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ప్రస్తుతం మండే ఎండలకు కూడళ్ళలో కొద్దిపాటి నీడ కూడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీ యంగా ఉంటోంది.
పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందిం చి అమరాపుర బస్టాండు, ప్రదానకూడళ్ళలో బస్‌షెల్టర్‌లు, తాగునీరు, సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ...
అమరాపురం బస్టాండులో ప్రయాణికులకు నిలువ నీడలేదని ప్ర యాణికుడు మంజునాథ్ వాపోయారు. ఎండకు ఎండుతూ, వానలకు తడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ళ లో బస్‌షెల్టర్ల నిర్మించాలి. బస్సులు వచ్చేంతవరకు మండే ఎండలో వేచి ఉం డాల్సి వస్తోంది. ఎక్కడకూడా కొద్దిపాటి నీడలేదు. సులభక్ష కాంప్లెక్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అమరాపురం బస్టాండులో ఉన్న బస్‌షెల్టర్‌ను కూడా తొలగొంచారు. ఇప్పటికైనా అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో బస్‌షెల్టర్‌లను నిర్మించాలని కోరుతున్నారు.