పసివాడిని కాటేసిన కలహాలుకుమారుడుసహా చెరువులో దూకిన తల్లి

ABN , First Publish Date - 2023-09-29T00:14:33+05:30 IST

తల్లిదండ్రుల కలహాలకు రెండేళ్ల పసివాడు బలయ్యాడు. కుటుంబ కలహాలతో తలుపుల మండలంకేంద్రానికి చెందిన నాగమణి.. కుమారుడు చందు (2)తో కలిసి గురువారం చెరువులోకి దూకేసింది.

పసివాడిని కాటేసిన కలహాలుకుమారుడుసహా   చెరువులో దూకిన తల్లి
బాలుడు చందు (ఫైల్‌)

బాలుడి మృతి

తల్లిని రక్షించిన స్థానికులుకదిరి, సెప్టెంబరు 28: తల్లిదండ్రుల కలహాలకు రెండేళ్ల పసివాడు బలయ్యాడు. కుటుంబ కలహాలతో తలుపుల మండలంకేంద్రానికి చెందిన నాగమణి.. కుమారుడు చందు (2)తో కలిసి గురువారం చెరువులోకి దూకేసింది. సమీపంలో ఉన్నవారు.. నాగమణిని కాపాడగా.. పసివాడు చనిపోయాడు. కదిరి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్ల తెలిపిన వివరాల మేరకు.. తలుపులలో శంకర్‌, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. వారికి రెండేళ్ల బాబు చందు ఉన్నాడు. ఇటీవలిగా దంపతుల మధ్య కలహాలు పొడచూపాయి. దీంతో విసిగిపోయిన నాగమణి.. కుమారుడు చందును తీసుకుని గురువారం మధ్యాహ్నం తలుపుల సమీపంలోని ఎర్రచెరువులో దూకేసింది. సమీపంలోని వారు గమనించి, అక్కడికి వచ్చి రక్షించేలోపే చిన్నారి మృతిచెందాడు. నాగమణిని రక్షించారు. బాలుడి మృతితో బోరున విలపించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2023-09-29T00:14:33+05:30 IST