అనధికారిక విద్యుత కోతలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-01T23:50:35+05:30 IST
విద్యుత కోతలు మార్చి నెల ప్రారం భం నుంచే మొదలయ్యాయి. అధికారులు మాత్రం కోతలు లేవంటూనే... ప్రతిరోజూ గంట, ఒకటిన్నర గంట పాటు కోతలు విధిస్తున్నారు.
హిందూపురం, ఏప్రిల్ 1: విద్యుత కోతలు మార్చి నెల ప్రారం భం నుంచే మొదలయ్యాయి. అధికారులు మాత్రం కోతలు లేవంటూనే... ప్రతిరోజూ గంట, ఒకటిన్నర గంట పాటు కోతలు విధిస్తున్నారు. వేసవి కాలానికి ముందే విద్యుత కోతలు ప్రారంభం కావడంతో అటు రైతులు, ఇటు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వి ద్యుత సరఫరాలో తరచూ అంతరాయం కలగడం, గంటల తరబడి కొన్నిసార్లు పవర్ కట్ చేస్తుండటంతో విద్యుత కోతలు మొదలైనట్లు భావించాలని ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలోని ప లు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత కోతలు అధికంగానే ఉన్నాయి. ప ట్టణాల్లో మాత్రం పగటి పూట అప్పుడప్పుడు కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. నిరంతరం విద్యుత సరఫరా చేస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు కోతలే అని తేలిపోయింది. అప్రకటిత కోతలు జనానికి విసుగు తెప్పిస్తున్నాయి. దీనికి తోడు పరీక్షల సీజన కావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోతలుమరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులు మాత్రం అ దేమీ లేదని చెబుతున్నా, వారి మాటలకు పూర్తిగా భిన్నంగా ఉన్న ట్లు అర్థమవుతోంది. ఒకవైపు ఎండలు పెరిగి పంటలు ఎండుతుం టే అధికారులు మాత్రం విద్యుత సరఫరాలో కోతలు విధించడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. హిందూపురం పరిధిలో కొన్ని ప్రాంతా ల్లో మోటార్లకు 7 గంటల పాటే సరఫరా చేస్తున్నారు. కానీ 9 గం టలు అంటూ అధికారులు బుకాయిస్తున్నారు.
పొంతన లేని సమాధానం...
మడకశిర నియోజకవర్గంలో అధికారులు చెబుతున్న విద్యుత స రఫరా సమాయానికి, వాస్తవానికి భిన్నంగా ఉంది. వ్యవసాయానికి కొన్ని చోట్ల 9 గంటలు చెబుతున్నా, 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అగళి మినహా మిగిలిన మండలాల్లో 7 గంటలు మా త్రమే విద్యుత సరఫరా చేస్తున్నారు. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినా, ఈ ఏడు బోరు బావుల కింద సాగు విస్తీర్ణం కొంత మేర పెరిగిందని చెప్పవచ్చు. విద్యుత వాడకం కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య ఉంది.