పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న జగనరెడ్డి
ABN , First Publish Date - 2023-05-21T00:03:34+05:30 IST
నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న మీడియాపై దాడు లకు తెగబడుతూ, సీఎం జగన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మండిపడ్డారు.
ఏబీఎన ప్రతినిధులపై దాడిని ఖండించిన సవిత
పెనుకొండ, మే 20: నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న మీడియాపై దాడు లకు తెగబడుతూ, సీఎం జగన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మండిపడ్డారు. ఏబీఎన ఛానల్ మీడియా ప్రతినిధులపై వైసీ పీ గూండాల దాడిని ఆమె ఖండించారు. శనివారం పట్టణంలోని ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినాశరెడ్డి ఎంపీనా? లేక వీధిగూండానా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవాలను వెలికితీస్తున్న మీడియా ప్రతినిధులపై ఎంపీ అ నుచరులు దాడిచేయడం దుర్మార్గపు చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు హాజరు కాకుండా కుంటిసాకులు చెప్పి పారిపోతున్న అవినాశరెడ్డి బాగోతాన్ని మీడియా బయటపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక దాడులకు దిగుతున్నారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు త్రివేంద్రనాయుడు, మావటూరు గోపాల్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్ర తినిధి మంజునాథ్, ముద్దన్న, చిన్నపోతన్న, నాగేంద్ర, వీరజిన్న, నాగార్జున పాల్గొన్నారు.