కనుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2023-04-08T00:00:48+05:30 IST
పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయ ఆ వరణలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం సీతారాముల క ల్యాణం, పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
మడకశిరటౌన, ఏప్రిల్ 7: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయ ఆ వరణలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం సీతారాముల క ల్యాణం, పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. వా రం రోజులపాటు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ లు చేశారు. చివరిరోజు ఆలయంలో కల్యాణోత్సవంతో పాటు హోమాలు, స్వామివార్లకు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు కొనసాగాయి. భక్తు లు తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం
పెనుకొండ: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం స్థానిక క న్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు శేషగిరిస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం స్వామివారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. సాయంత్రం గ్రా మోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అన్నదానం చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వరలక్ష్మీ అలంకరణలో దుర్గాదేవి
లేపాక్షి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన స్థానిక దుర్గా వీరభద్రస్వామి ఆ లయంలో శుక్రవారం అమ్మవారు వరలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
లక్ష్మీనిడిమామిడమ్మకు జ్యోతుల ఉత్సవం
మడకశిర రూరల్: మండలంలోని జమ్మానిపల్లిలో వెలసిన లక్ష్మీనిడిమామిడమ్మ దేవతకు శుక్రవారం గ్రామస్థులు జ్యోతుల ఉత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో చండీహోమం, అభిషేకా లు చేశారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఊరేగింపుగా వచ్చి, అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న, మాజీ సర్పంచు గుండుమల చంద్రప్ప, క్లస్టర్ ఇనచార్జి నాగరాజు, కిష్టప్ప, రమేష్ అమ్మవారిని దర్శించుకున్నారు.
చౌడమాంబదేవికి ప్రత్యేక పూజలు
సోమందేపల్లి: స్థానిక పాతూరు చౌడేశ్వరీ ఆలయంలో శుక్రవారం అ మ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి యేడాది ఉగాది పర్వది నాన్ని పురస్కరించుకుని జరిగే జ్యోతుల ఉత్సవం అనంతరం నెలరోజు త రువాత ఆలయంలో నెల బాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు అ ధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి రూ.లక్ష విరాళం
గోరంట్ల: పట్టణంలోని కొలిమి చింతమాను వద్ద నూతనంగా నిర్మిస్తు న్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఉపాధ్యాయులు నాగేనాయక్, సరోజ దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలకు పూలమాలలు వేసి సన్మానించారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి నారాయణస్వామి, టైలర్ కిష్టప్ప, గణేష్, బొక్కసం నాగభూషణం, నాగప్ప, సుబ్రహ్మణ్యం, నాగరాజు పాల్గొన్నారు.