ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య సమన్వయలోపం

ABN , First Publish Date - 2023-04-17T23:40:14+05:30 IST

మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య సమన్వయ లోపం కొట్టొస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అటకె క్కాయి. లక్షలాది రూపాయల నిధులున్నా నిరుపయోగంగా మారుతు న్నాయి.

ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య సమన్వయలోపం

అభివృద్ధి పనులకు అడ్డు

మురిగిపోతున్న రూ69 లక్షల నిధులు

అగళి, ఏప్రిల్‌ 17: మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య సమన్వయ లోపం కొట్టొస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అటకె క్కాయి. లక్షలాది రూపాయల నిధులున్నా నిరుపయోగంగా మారుతు న్నాయి. పనుల ఊసే లేకుండా పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మండల సర్వసమావేశా ల్లో పనులు చేపట్టాలని ఎంపీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. మండల పరిషత కార్యాలయంలో 2020-2021, 2021-2022 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక ఫైనాన్స కిం ద ఎంపీటీసీలకు రూ.69 లక్షల నిధులు మంజూరయ్యాయి. నేటికీ నిధులు మురుగుతున్నాయే తప్పా అభివృద్ధి జాడ కానరాలేదు. ఈనిధు లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు అభివృద్ధి పనులకు ఖర్చు చేయకపో తే, వెనక్కు మళ్లనున్నాయి. ఉన్న నిధులతో పనులు చేపడితే సకాలం లో బిల్లులు మంజూరవుతాయో లేదో అని పలువురు సభ్యులు పను లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. మంజూరైన నిధులతో తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పైప్‌లైనలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అ యితే 15వ ఆర్థిక ఫైనాన్స కింద మంజూరైన నిధులు ఖర్చు చేయకపోతే మళ్లీ నిధులు రావని అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నిధులు వెనక్కు మళ్లకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సభ్యులతో చర్చించి త్వరలో పనులు చేపడతాం

నాగేంద్రకుమార్‌, ఎంపీడీఓ

మండలానికి 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. ఈనిధులతో ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులపై సభ్యులతో చర్చిస్తాం. త్వరలో పనులు చేపడతాం.

Updated Date - 2023-04-17T23:40:14+05:30 IST