పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ABN , First Publish Date - 2023-06-07T00:13:33+05:30 IST

మొక్కలు విరివిగా నాటుదాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి పిలుపినిచ్చారు.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణారెడ్డి

పుట్టపర్తిరూరల్‌, జూన 6: మొక్కలు విరివిగా నాటుదాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి పిలుపినిచ్చారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచపర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటి, సంరక్షించాలన్నారు. అనంతరం పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ఏపీ ఎడమాలజిస్టు బాలాజీనాయక్‌, వైద్యసిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు, కార్యక్రమంలో ఎనసీడీ ఆర్‌బీఎస్కే ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ నివేదిత, డాక్టర్‌ నాగరాజ్‌నాయక్‌, సీహెచఓ నగేష్‌, పీహెచఎన లలితకుమారి, డీసీఎం త్రిలోక్‌నాథ్‌, సూపర్‌వైజర్‌ రమణ, ఎంపీహెచఏ శివయ్య, ఎంఎల్‌హెచపీలు, ఏఎనఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:13:33+05:30 IST