మహాశక్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దాం

ABN , First Publish Date - 2023-07-31T23:56:21+05:30 IST

రాబోవు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు.

మహాశక్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దాం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల

ప్రచార వాహనం ప్రారంభం

మడకశిర రూరల్‌, జూలై 31: రాబోవు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు. మండలంలోని గౌడనహళ్లిలో సోమవారం ఆయన మహాశక్తి ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడులో మినీ మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. అందులో మహిళల కోసం రూపొందించిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా మహిళలకు మహాశక్తి వాహనాన్ని ఏర్పా టుచేశామన్నారు. ఈ వాహనం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరుగుతుందన్నారు. మినీ మేనిఫెస్టోలో ఉన్న పఽఽథకాలు మహిళలకు ఎంతగా దోహదపడతాయో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి చెబుతామన్నారు. వైసీసీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధనాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాశక్తి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గ ఇనచార్జ్‌ మీనాక్షి. మండల అధ్యక్షురాలు శారదమ్మ, టీడీపీ మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, క్లస్టర్‌ ఇనచార్జ్‌ నాగరాజు, కురుబ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు గోవిందప్ప, మల్లికార్జున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-31T23:56:21+05:30 IST