గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-11-15T00:01:19+05:30 IST
పుస్తకం పఠనం వార్తాపత్రికలు చదవడం వలన విజ్ఞానవంతుల వుతారని రిటైర్డ్ ఎంఈఓ జయచంద్రారెడ్డి పేర్కొ న్నారు.
గోరంట్ల, నవంబరు 14: పుస్తకం పఠనం వార్తాపత్రికలు చదవడం వలన విజ్ఞానవంతుల వుతారని రిటైర్డ్ ఎంఈఓ జయచంద్రారెడ్డి పేర్కొ న్నారు. గోరంట్లలోని గ్రంథాయలంలో 56వ జాతీయ వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీవరకు ప్రతిరోజూ ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహిస్తారని, విద్యార్థు లు హాజరుకావాలని ఆయన సూచించారు. అలాగే బాలదినో త్సవం ప్రాముఖ్యతను వివరించా రు. పిల్లలకు పెన్నులు, మిఠా యిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యుడు బైసాని శ్రీనివాస గుప్త, గ్రం థాలయాఽఽధికారి రమేష్‌నాయక్, విద్యార్థులున్నారు.
గుడిబండ : గ్రంథాలయం లోని పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని గ్రంఽథాలయా ధికా రి కేరావు పేర్కొన్నారు. గుడి బండలో మంగళవారం నుంచి ఈనెల 20వరకు గ్రంథాలయ వా రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా జవహర్‌లాల్‌నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.