మూడేళ్లుగా అందని పశువుల బీమా

ABN , First Publish Date - 2023-04-03T00:11:10+05:30 IST

వ్యాధులబారిన పడి మృత్యువాత పడ్డ పాడి పశువులకు మూడేళ్లుగా బీమా సౌకర్యం కల్పించలేదు. దీంతో మం డలంలోని బాధిత పాడి రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా రు.

మూడేళ్లుగా అందని పశువుల బీమా

కార్యాలయాల చుట్టూ పాడి రైతుల ప్రదక్షిణ

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 2: వ్యాధులబారిన పడి మృత్యువాత పడ్డ పాడి పశువులకు మూడేళ్లుగా బీమా సౌకర్యం కల్పించలేదు. దీంతో మం డలంలోని బాధిత పాడి రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా రు. ప్రతి పశువుకు రూ.30 వేలు బీమా ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం పాడి రైతులకు ధీమా ఇచ్చింది అయితే మూడేళ్లుగా నేటికీ ఒక్క పాడి ప శువుకు కూడా బీమా ఇవ్వలేదు. దీంతో పాడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్య క్తంచేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ గంణాంకాల ప్రకారం ఏప్రిల్‌ 2020 నుంచి 2023 మార్చి వరకు మండలంలో 365 పాడి పశువులు మృత్యవా త పడ్డాయి. వెటర్నరీ అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారే గానీ, బీమా పరిహారం చేతికిఅందకుండా పోతోంది. దీంతో రైతులు వెటర్నరీ కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల బీమా ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ అమర్‌ను వివరణ కోరగా, మడకశిర క్లస్టర్‌ పరిఽధిలో మడకశిర, రొళ్ళ, అగళి మండలాల పరిధిలో ఇప్పటివరకు 750 పాడి పశువులు మృత్యువాత పడినట్లు ఉన్నతాధికారులకు నివేదించామని, బీ మా సొమ్మురాగానే రైతుల ఖాతాల్లోకి జమచేస్తామని తెలిపారు.

Updated Date - 2023-04-03T00:11:10+05:30 IST