అలుపెరుగని యోధుడు లోకేశ

ABN , First Publish Date - 2023-04-23T00:03:36+05:30 IST

అలుపెరుగని యోధుడు యువనేత నారాలోకేశ అని టీడీపీ నాయకులు అన్నారు.

అలుపెరుగని యోధుడు లోకేశ

కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న టీడీపీ నాయకులు

హిందూపురం, ఏప్రిల్‌ 22: అలుపెరుగని యోధుడు యువనేత నారాలోకేశ అని టీడీపీ నాయకులు అన్నారు. యువగళం పాదయాత్ర 1000 కిలో మీటర్లు దిగ్విజయం గా పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతు యువత భవిష్యత్తుకో సం లోకేశ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందన్నారు. సీఎం జగన నాలుగేళ్ళలో రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలలతో పాటు దేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, నాయకులు అమర్‌నాథ్‌, డీ ఈ రమేష్‌ హెచఎన రాము, రవీంద్రనాయుడు, ప్రెస్‌ వెంకటేష్‌, రాఘవేంద్ర, నారాయణరెడ్డి, తిరుపతయ్య, పరిమళ, మురళి, బాచి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-23T00:03:36+05:30 IST