20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ

ABN , First Publish Date - 2023-02-19T23:40:58+05:30 IST

తెలుగు సాహిత్యాన్ని 20వ శతాబ్దంలో శాసించిన మహాకవి, సంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవకవి శ్రీశ్రీ అని వక్తలు కొనియాడారు.

20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ

అనంతపురం కల్చరల్‌, ఫిబ్రవరి 19 : తెలుగు సాహిత్యాన్ని 20వ శతాబ్దంలో శాసించిన మహాకవి, సంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవకవి శ్రీశ్రీ అని వక్తలు కొనియాడారు. ఆదివారం సాయంత్రం ఆర్ట్స్‌ కళాశాల కామర్స్‌ బ్లాక్‌ వద్ద మహాకవి శ్రీశ్రీ సాహిత్య సాంస్కృతిక ఉత్సవం సాహితీ స్రవంతి నాయకులు ప్రజ్ఞాసురేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షు రాలు ప్రగతి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన కవితా సంకలనం మహా ప్రస్థానం... శ్రీశ్రీ కవితా ప్రస్థానంలో ఓ మైలురాయి అని పేర్కొ న్నారు. విశ్రాంత తహసీల్దార్‌ జయరామప్ప మాట్లాడుతూ పేద ప్రజలకోసం ఏర్పడిన సిద్దాంతాలేవైనా అవి తనవేనంటూ చాటిచెప్పిన మహనీయుడు శ్రీశ్రీ అని కొనియాడారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నానీల నాగేంద్ర మాట్లాడుతూ ఆధునిక సాహిత్యాన్ని మహాప్రస్థానానానికి ముందు, తర్వాతగా విభజించి చెప్పడంలో అతిశయోక్తిలేదు. అనంతరం పిల్లలు శ్రీశ్రీ రచించిన అనేక గీతాలకు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో విశ్వం విజ్ఞానకేంద్రం నాయకులు ఎంఎనటీరాజు, కవి రియాజుద్దీన, కులవివక్ష వ్యతిరేకసంఘం నాయకులు నల్లప్ప, ఎస్‌ఎ్‌ఫఐ నాయకుడు పరమేష్‌, డీవైఎ్‌ఫఐ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T23:41:00+05:30 IST