జనావాసంలో మయూర విహారం
ABN , First Publish Date - 2023-06-03T00:02:55+05:30 IST
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
గాండ్లపెంట, జూన 2: ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి. గాండ్లపెంట చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నెమళ్లు, జింకలు, అడవిపందులు అధికంగా ఉన్నాయి. రైతుల పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. కొన్ని వేటగాళ్ల ఉచ్చులో విలవిలలాడుతున్నాయి. అటవీశాఖాధికారులు వన్యప్రాణుల సంరక్షణ అటకెక్కించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, ఆహారం కల్పించకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. శుక్రవారం ఓ నెమలి ఆహారం కోసం గాండ్లపెంట వీధుల్లోకి చేరింది. జనం వెంట, ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఆహారం సేకరించుకుంది. నెమలిని వీధి కుక్కలు వెంబడించాయి. వాటిబారి నుంచి తప్పించుకుని ఓ ఇంటిపైకి వెళ్లడంతో ప్రాణాలు రక్షించుకుంది. నెమలిని చూసేందుకు పిల్లలు, పెద్దలు తరలివచ్చారు.