పాఠశాలల విలీనంతో విద్యార్థులకు అగచాట్లు: టీడీపీ
ABN , First Publish Date - 2023-04-29T00:09:06+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల విలీనంతో వి ద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నా గేంద్ర విమర్శించారు.
రొద్దం, ఏప్రిల్ 28: గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల విలీనంతో వి ద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నా గేంద్ర విమర్శించారు. శుక్రవారం మండలంలోని బూచర్ల గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నా యకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వి వరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నాడు-నేడు పనులకు ప్రభుత్వం సకాలంలో సిమెంట్, నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడవేసి న గొంగళి అక్కడే అన్నచందంగా తయారైందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని వా పోయారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, కదిరన్న, మల్లేష్, శివకుమార్, శంకరప్ప, తిమ్మప్ప, పెద్దన్న, మల్లన్న, నాగప్ప, పెద్ద అం జినప్ప, కిష్టప్ప, గోపాల్, ముత్యాలు, నాగేంద్రప్ప, సుబ్బరాయుడు, సిద్ద న్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
రొళ్ల: మండలంలోని బీజీ హళ్లి, గుడ్డగుర్కి, రత్నగిరి పంచాయతీల లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అబ్జర్వర్ పార్థసారథిరెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం జగన చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈసందర్భంగా ఓటరు వెరిఫికేషన, హౌస్‌మ్యాపింగ్, సభ్యత్వనమోదు కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. అంతకుముందు ఆయన రత్నగిరి కొల్లాపురమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసిరెడ్డి, మండల కార్యదర్శి ఈరన్న, క్లస్టర్ ఇనచార్జి భరత, తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు.